Lifestyle
నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం.
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే ఓర్పు ఎంత ముఖ్యమైందో ఈ సూక్తి చెబుతోంది.
తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకనే గొప్ప సందేశం ఇందులో ఉంది.
పట్టువదలకుండా చేసే ప్రయత్నం కచ్చితంగా విజయాన్ని అందిస్తుంది. ఒక్క రోజులోనే దేన్నీ సాధించలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా రెట్టించినా ఉత్సాహంతో ముందుకు వెళ్లాలన్న అర్థం ఇందులో ఉంది.
మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. నీ సంతోషం ఇతరుల సంతోషంపై ఆధారపడి ఉంటుందన్న సూక్తి ఇందులో ఉంది.
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచననూ విస్మరించండి.