చైన్ ఇయర్ రింగ్స్ చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి. సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖం కదిపినప్పుడు ఈ చైన్ అందంగా కదులుతూ ఉంటుంది.
మినిమల్ డిజైన్లు ఇష్టపడేవారికి స్టార్ షేప్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. చిన్న హూప్‌కి సన్నని చైన్, దాని చివరన స్టార్ షేప్ చార్మ్ ఉంటుంది. ఈ డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
హ్యాంగింగ్ చార్మ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిలో సర్కిల్స్, గోల్డెన్ బీడ్స్, స్టార్స్ వంటి అందమైన చార్మ్స్ ఉంటాయి.
యూనిక్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు స్టార్ అండ్ మూన్ షేప్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలో పైన హాఫ్ మూన్ డిజైన్, వెనుక వైపు చైన్‌తో పాటు స్టార్ చార్మ్ ఉంటుంది.
లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్.. అన్ని రకాల దుస్తులపైనా అద్భుతంగా కనిపిస్తాయి. గోల్డ్ హూప్స్ కి పొడవాటి చైన్, చివర్లో స్టార్ చార్మ్స్ ఉంటాయి. ఇవి ముఖానికి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
హార్ట్ షేప్ డిజైన్లు ఇష్టపడేవారికి ఈ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. వీటిలో చాలా సన్నని చైన్‌లకు చిన్న చిన్న హార్ట్ చార్మ్స్ జతచేసి ఉంటాయి. ఇవి ఫెమినిన్ లుక్ ఇస్తాయి.
డైలీ వేర్ కోసం సింపుల్, క్లాసీ డిజైన్ కావాలనుకుంటే డైమండ్, గోల్డ్ కాంబినేషన్‌తో వచ్చే ఈ ఇయర్ రింగ్స్ ని ఎంచుకోవచ్చు. వీటిలో చిన్న స్టోన్స్, సన్నని చైన్ కాంబినేషన్ ఉంటుంది.
స్టోన్ ప్యాటర్న్ చైన్ ఇయర్ రింగ్స్‌లో రూబీ, డైమండ్ లేదా ఇతర స్టోన్స్‌తో అందమైన డిజైనింగ్ ఉంటుంది. ఇవి పార్టీలు, పండగలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.