Lifestyle
పాల చాయ్, కాఫీ కంటే గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. అసలు దీన్ని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలనుకునే వారికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. పరిగడుపున గ్రీన్ టీని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
డయాబెటీస్ పేషెంట్లకు గ్రీన్ టీ చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
గ్రీన్ టీ మన మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
రోజూ ఉదయాన్నే గ్రీన్ టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు రావు.
చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ముప్పుఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గ్రీన్ టీని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది.
ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత హెల్తీగా, ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాం. అయితే గ్రీన్ టీ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగితే ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతాయి.