దేశంలో కపుల్స్ ఎక్కువగా ఇష్టపడే నగరం ఎంటో తెలుసా? OYO సర్వేలో
Telugu
OYO వార్షిక నివేదిక విడుదల
2024 సంవత్సరాంతంలో oyo తన వార్షిక నివేదిక ట్రావెలోపీడియా 2024ను విడుదల చేసింది. ఈ సంవత్సరం జంటలకు ఇష్టమైన నగరం ఏది, ఎక్కడ అత్యధిక బుకింగ్‌లు జరిగాయో ఈ నివేదికలో తెలిపింది.
Telugu
ఢిల్లీ, ముంబైని దాటి జైపూర్
2024లో ఢిల్లీ, ముంబై, షిమ్లా, మనాలి వంటి నగరాల కంటే హైదరాబాద్, జైపూర్‌లకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది. జైపూర్ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది.
Telugu
జైపూర్ ఎందుకంత ఇష్టం.?
ఇతర నగరాలతో పోలిస్తే జైపూర్ ను తక్కువ ఖర్చుతోనే ఎక్స్ ప్లోర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సందర్శించదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ కారణాలే జైపూర్ ను మొదటి స్థానంలో నిలిపాయి.
Telugu
జైపూర్ ప్రశాంత నగరం
జైపూర్ నగరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారసత్వ చరిత్ర ఉన్న ఈ నగరంలో హిస్టారిక్ ప్రదేశాలు చాలా ఉన్నాయి. 2024లో జంటలు ఎక్కువ సంఖ్యలో జైపూర్ సందర్శించి, హోటల్స్ ను బుక్ చేసుకున్నారు.
Telugu
మతపరమైన పర్యాటక ఏడాది
2024ని మతపరమైన పర్యాటక సంవత్సరంగా ఓయో పేర్కొంది. హరిద్వార్, వారణాసి, పూరీ, దేవ్‌ఘర్, గోవర్ధన్ వంటి మతపరమైన ప్రదేశాలను ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో సందర్శించారు.
Telugu
విదేశీయులకు ఇష్టం రాజస్థాన్
దేశీయులే కాదు, విదేశీయులు కూడా ఇష్టపడే భారతదేశంలోని ఏకైక నగరం జైపూర్. రాజస్థాన్‌లోని అనేక నగరాలకు ఏడాది పొడవునా విదేశీ పర్యాటకులు వస్తుంటారని పలు గణంకాలు చెబుతున్నాయి.