Lifestyle

వాటర్‌ హీటర్‌ తెల్లగా మారిందా? ఇలా చేయకపోతే నష్టం తప్పదు

అసలు కారణం ఏంటి?

వాటర్‌ హీటర్‌పై ఇలా తెల్లటి పొర ఏర్పడడానికి నీటిలోని మినరల్స్‌ ప్రధాన కారణం. నీరు త్వరగా వేడెక్కాలన్నా, కరెంట్‌ బిల్లు తక్కువ రావాలన్నా రాడ్‌ను శుభ్రం చేసుకోవాలి. 
 

రాడ్‌ను చల్లారనివ్వండి

ఇందుకోసం ముందుగా వాటర్‌ హీటర్‌ను బయటకు తీసి కాసేపు పక్కన పెట్టాలి. ప్లగ్‌ బయటకు తీశారా లేదో నిర్ధారించుకోవాలి. అలాగే రాడ్ పూర్తిగా చల్లారే వరకు ఆగాలి.  

వెనిగర్ లేదా నిమ్మరసం

రాడ్‌ను శుభ్రం చేయడానికి ముందుగా ఒక బకెట్‌లో నీరు తీసుకొని అందులో కొంత వెనిగర్‌ లేదా నిమ్మరసంను వేయాలి. అనంతరం రాడ్‌ను కాసేపు అలాగే ఉంచండి. కొద్ది సేపటికి తెల్లటి పొర తొలగిపోతుంది. 

బ్రష్‌ లేదా స్క్రబ్బర్‌తో

పైన తెలిపినట్లు బకెట్‌లో ఉంచిన తర్వాత రాడ్‌ను బయటకు తీయాలి. అనంతరం మెత్తటి బ్రష్‌ లేదా స్క్రబ్బర్‌తో శుభ్రం చేయాలి. అయితే నెమ్మదిగా రుద్దాలని గుర్తుపెట్టుకోండి. 

ఇవి కూడా..

బేకింగ్‌ సోడా, ఉప్పులో కొంత నీరు పోసి తయారు చేసుకున్న పేస్ట్‌ను రాడ్‌కు బాగా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత పాత టూత్‌ బ్రష్‌తో రబ్‌ చేస్తే సరిపోతుంది. 

చివరిగా..

పైన తెలిపిన వాటిని రాడ్‌కు అప్లై చేసిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. రాడ్‌పై ఎలాంటి మరకలు లేకుండా చూసుకోవాలి. అనంతరం కాసేపు ఆరబెట్టిన తర్వాత రాడ్‌ను ఉపయోగించుకోవాలి. 

చింతపండుతో కొలిస్ట్రాల్ కి చెక్?

కోడలు తన మామగారిని ఇలా అస్సలు అనకూడదు

రోజూ ఒక లవంగం తినండి చాలు.. ఈ సమస్యలన్నీ పరార్‌

విద్యా బాలన్ లా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?