దేవుడిని మనం భక్తితో పూజించాలి. ఆ స్వామి వారి విగ్రహం కొత్తగా మెరుస్తూ ఉంటే.. మనకు.. భక్తి మరింత పెరుగుతుంది. మరి, ఇత్తడి విగ్రహాలను ఈజీగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం
Image credits: Pinterest
ముందుగా దుమ్ము తుడవాలి
ఇత్తడి లేదా కంచు విగ్రహాలను శుభ్రపరిచే ముందు శుభ్రమైన వస్త్రంతో దుమ్ము తుడవాలి. తర్వాత విగ్రహాన్ని తడిపి శుభ్రపరచాలి.
Image credits: Pinterest
ఈ విధంగా శుభ్రపరచండి
ఇత్తడి విగ్రహాన్ని శుభ్రపరచడానికి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి, అర టీ స్పూన్ ఉప్పు, తెల్ల వెనిగర్ కలిపి పేస్ట్ లా చేయాలి. దాన్ని విగ్రహానికి రాసి శుభ్రపరచాలి.
నిమ్మరసం, బేకింగ్ సోడా
నిమ్మరసం, బేకింగ్ సోడా పేస్ట్ లా చేసి విగ్రహం మీద రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రపరచాలి.
చింతపండు గుజ్జు
చింతపండుని నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత దాన్ని పిసికి గుజ్జు తీయాలి. ఈ గుజ్జుని విగ్రహాల మీద రుద్ది వేడి నీళ్లతో శుభ్రపరచాలి.
శనగపిండి-పెరుగు
ఒక స్పూన్ శనగపిండి, పసుపు, పెరుగు, నిమ్మరసం కలపాలి. ఇత్తడి విగ్రహానికి రాసి తర్వాత కడగాలి.
నీరు - వెనిగర్ ద్రావణం
నీరు, తెల్ల వెనిగర్ కలిపి ద్రావణం తయారు చేసి అందులో ఇత్తడి విగ్రహాలను నానబెట్టాలి. తర్వాత చేతులతో లేదా బట్టతో నెమ్మదిగా రుద్ది శుభ్రపరచాలి.