Lifestyle

చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి సమయాల్లో నీళ్లు విషం అవుతాయి

ఎప్పుడు నీరు త్రాగకూడదు?

ఆచార్య చాణక్యుడు మన దేశంలోని గొప్ప గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన నీళ్ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాణక్య నీతి

నీళ్లు ఆహారం జీర్ణం కానప్పుడు ఔషదంలా పనిచేస్తాయి. ఇవి వృద్ధులకు శక్తినిస్తాయి. తింటూ కొన్ని నీళ్లు తాగితే అమృతంలా పని చేస్తాయి.అదే తిన్న వెంటనే నీళ్లు తాగితే విషంలా పనిచేస్తుంది.

నీరు ఎప్పుడు ఔషదం అవుతుంది?

అజీర్ణం సమస్య ఉన్నప్పుడు నీళ్లు మనకు ఔషధంలా పనిచేస్తాయి. అంటే ఈ సమయంలో నీళ్లను తాగితే శరీరానికి మంచి జరుగుతుంది. 

వృద్ధులకు నీరు తప్పనిసరి

వృద్ధులు ఎప్పటికప్పుడు నీళ్లను పుష్కలంగా తాగుతుండాలి. ఎందుకంటే వారికి నీళ్లే శక్తినిస్తాయి. మీకు తెలుసా? ఈ సమయంలో నీళ్లు ఎక్కువ తాగుతూ.. తక్కువ ఫుడ్ తినాలి. 

ఇలాంటి నీరు అమృతంలాంటిది

తింటున్నప్పుడు మధ్యమధ్యలో నీళ్లను కొన్ని తాగొచ్చు. కానీ ఎక్కువగా మాత్రం తాగకూడదు. ఇది మీకు అమృతంలా పనిచేస్తుంది.

నీరు ఎప్పుడు విషం అవుతుంది?

ఆచార్య చాణక్య ప్రకారం.. తిన్నవెంటనే నీళ్లను అస్సలు తాగకూడదు. దీనివల్ల నీరు విషంలా పనిచేస్తుంది. అంటే దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

Find Next One