Lifestyle

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే..

Image credits: Getty

ఆపిల్‌

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆపిల్‌ ఉపయోగపడుతుంది. ఇందులో పొటాసియం, షాస్పరస్‌ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతాయి. 
 

Image credits: Getty

దానిమ్మ

దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరు. వీటిని నేరుగా తీసుకున్నా, జ్యూస్‌ రూపంలో తీసుకున్నా కిడ్నీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: social media

పుచ్చకాయ

నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకున్నా కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపండంలో మూత్ర పిండాలు హైడ్రేట్‌గా ఉండడంలో దోహదపడతాయి. 
 

Image credits: Getty

సిట్రస్‌ పండ్లు

విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది.
 

Image credits: Getty

బొప్పాయి

కిడ్నీల పనితీరు మెరుగుపరచడంలో బొప్పాయి కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

Image credits: Pinterest

బెర్రీలు

బెర్రీల్లో సోడియం, ఫాస్పరస్ తక్కువగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఫుడ్స్ ఇవే

నాన్న నుంచి పిల్లలు కోరుకునేది ఏంటో తెలుసా?

హనుమాన్ ప్రేరణతో పిల్లలకు అద్భుతమైన పేర్లు

Chanakya niti: వెజ్ మంచిదా? నాన్ వెజ్ మంచిదా?