Lifestyle

'ఏమీ చేయకపోవడం'

ఏమీ చేయకుండా ఉండడం అంటే సోమరితనానికి నిదర్శనంగా చెబుతుంటారు. అయితే ఏమీ చేయకపోవడం అంటే పనిపాట లేకుండా కూర్చోవడం కాదని దీనికి సరికొత్త అర్థం చెబుతున్నారు నిపుణులు. 

Image credits: Getty

కొంత సేపు ఏమీ చేయకుండా ఉండడం..

పనులన్నింటినీ వదిలేసి అదే పనిగా ఖాళీగా జల్సాలు చేయడం గురించి కాదిది. ప్రతీ రోజూ కొంత సేపు ఏమీ చేయకుండా ఉండడం గురించి. 

Image credits: Getty

బిజీ జీవితంలో..

ప్రస్తుతం జీవితాలు చాలా బిజీగా మారిపోయాయి. ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటుంది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వినియోగంతో నిత్యం ఏ పనిలేకపోయినా బిజీగా ఉంటున్నారు. 

Image credits: Getty

విశ్రాంతి కావాలి

ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. మెదడుకు తట్టుకోలేనంత సమాచారం లభిస్తోంది. కాబట్టి రోజులో కాసేపైనా మెదడుకు విశ్రాంతి ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. వ

Image credits: Getty

ప్రశాంతంగా

రోజులో కాసేపు ఏం చేయకుండా, ఏం ఆలోచించకుండా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆలోచనలు కూడా ప్రశాంతంగా మారుతాయి. 

Image credits: Getty

ఉత్పాదకత

నిజానికి ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కు ఉత్పాదక వస్తుందని అనుకుంటారు. కానీ నాణ్యమైన సమయం తక్కువైనా సరే కేటాయిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం మెడిటేషన్ వంటివి చేయాలి. 

Image credits: Getty

శ్రద్ధ

కాసేపు ఏం చేయకుండా ఉంటే చేసే పనిపై శ్రద్ధ పెరుగుతుంది. మల్టీ టాస్కులు చేయడం సులభతరం అవుతుంది. అందుకే రోజులో కొంత సేపైనా ఏం చేయకుండా ఉండాలి. 

Image credits: Getty

క్రియేటివిటీ పెరుగుతుంది

ఏమీ చేయకుండా ఉండటం మన సృజనాత్మక నైపుణ్యాలు పెరుగుతాయి. రోజులో కాసేపు ఏం చేయకుండా అలాగే ఉంటే రోజంతా ఉషారుగా ఉంటారు. 

Image credits: Getty

వర్కింగ్ ఉమెన్స్‌కి ఈ ఇయర్‌ రింగ్స్‌ పర్‌ఫెక్ట్‌.. తక్కువ గోల్డ్‌తోనే

మందు తాగగానే ఎందుకు ఇంగ్లీష్ తన్నుకొస్తుంది?

ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదా? కాదా?

కిడ్నీల ఆరోగ్యం కోసం ఉదయం ఇలా చేయండి