Lifestyle
రెగ్యులర్ కమ్మలు ఉపయోగిస్తూ బోర్ కొడుతోందా.? అయితే ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ను ట్రై చేయండి. ఇవి ఫార్మల్ మొదలు అన్ని రకాల దుస్తులకు సరిగ్గా సెట్ అవుతాయి.
ఫొటోలో కనిపిస్తున్న ఈ డిజైన్ చాలా బాగుంటుంది. నిజానికి ఇవి పాత డిజైన్ అయినా చూడ్డానికి గ్రాండ్ లుక్ ఉంటుంది. శారీలపైకి కూడా ఇవి బాగుంటాయి.
మీరు ఒకవేళ నగ్ వర్క్ఇష్టపడితే.. వన్ గ్రాములో డిఫ్రెంట్ కలర్ స్టోన్స్ పొదిగి ఉన్న ఈ కమ్మలు ఆఫీసులతో పాటు, పార్టీలకు వెళ్లేప్పుడు ధరించవచ్చు.
నగ్ ఉన్న బంగారు కమ్మలు మహిళలు ఎప్పుడు ఇష్టపడుతారు. యువతలో వీటికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ రడీమేడ్ గా కూడా లభిస్తాయి.
తక్కువ ఖర్చుతో మంచి లుక్ కోరుకునే వారికి ఈ ఐబాల్ ఉన్న కమ్మలు మంచి ఎంపికగా చెప్పొచ్చు. వీటిని ఒకగ్రాములో సులభంగా చేయించుకోవచ్చు.
లోలకం ఉండే ఈ బంగారు కమ్మలు చూడ్డానికి చాలా బాగుంటాయి. బంగారు దుకాణాల్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీరలపైకి కూడా ఈ కమ్మలు సెట్ అవుతాయి.
ట్రండీ లుక్ కోరుకునే వారికి, వెస్ట్రన్ దుస్తులు ధరించే వారికి ఈ ఇయర్ రింగ్స్ బాగా సూట్ అవుతాయి. ఇవి కూడా తక్కువ బంగారంతోనే పూర్తవుతాయి.