Silk Sarees: ఈ చీరలకు ప్రపంచమే దాసోహం..వీటితో మహిళల అందం రెట్టింపు
life Jul 01 2026
Author: Nandini Arava Image Credits:Pinterest
Telugu
కంచిపట్టు చీర
తమిళనాడు ప్రత్యేకం కంచిపట్టు చీరలు. ఇవి మందపాటి నేతకు, స్వచ్ఛమైన బంగారు జరీ పనితనానికి ప్రసిద్ధి. పెళ్లికూతుళ్లకు రెట్టింపు అందాన్నిస్తాయి.
Image credits: Pinterest
Telugu
బనారసీ పట్టు
వారణాసిలో తయారయ్యే ఈ చీరలు మొఘలుల కాలం నాటి కళా నైపుణ్యాన్ని గుర్తు చేస్తాయి. సన్నటి పట్టుపై బంగారం, వెండి దారాలతో నేసిన డిజైన్లు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
Image credits: Pinterest
Telugu
పైతానీ పట్టు
ఇది మహారాష్ట్ర సంప్రదాయ చీర. దీని కొంగుపై నేసిన రంగురంగుల నెమలి డిజైన్లు చాలా ప్రత్యేకం. చేనేత కళలో ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ.
Image credits: Pinterest
Telugu
మైసూర్ సిల్క్
కర్ణాటకకు చెందిన మైసూర్ పట్టు చీరలు చాలా ప్రత్యేకం. ఇవి మృదుత్వానికి, తక్కువ బరువుకు ప్రసిద్ధి చెందాయి. ఈ చీర కట్టుకుంటే సింపుల్‌గా కనిపిస్తూనే, రిచ్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
పటోలా పట్టు
గుజరాత్‌కు చెందిన ఈ చీరను 'ఇక్కత్' అనే డబుల్ వీవింగ్ పద్ధతిలో తయారుచేస్తారు. చీరకు రెండు వైపులా ఒకే రకమైన డిజైన్, రంగులు ఉండటం దీని ప్రత్యేకత.
Image credits: Pinterest
Telugu
మూగా సిల్క్
అస్సాం రాష్ట్రంలోని అరుదైన పట్టు పురుగుల నుంచి ఈ పట్టును తీస్తారు. ఇది సహజంగానే మెరిసే బంగారు రంగులో ఉంటుంది. ఈ చీరను ఉతికే కొద్దీ దాని మెరుపు మరింత పెరుగుతుంది.
Image credits: Pinterest
Telugu
చందేరీ పట్టు
మధ్యప్రదేశ్‌కు చెందిన చందేరీ చీరలను పట్టు, కాటన్ మిశ్రమంతో నేస్తారు. దీని మృదుత్వం, చిన్న పూల డిజైన్లు వేసవి కాలానికి ఇది సరైన ఎంపికగా నిలుపుతాయి.