Lifestyle
చాలా మంది డబ్బాలకు డబ్బాలు మెడిసిన్స్ ను తెచ్చుకున్నా.. వాటిని మాత్రం వేసుకోరు. ఇలా వాటి ఎక్స్ పైరీ డేట్ ను అయిపోగొడుతుంటారు. కానీ వీటిని మీరు వేరే పనులకు కూడా వాడొచ్చు.
అవును ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన మందలతో మీరు చెవి కమ్మలను తయారుచేయొచ్చు. ఈ మందుల కవర్లకు రంగులు వేసి అందమైన కుందన్, రాళ్లను అతికించి కమ్మలను తయారుచేసి పెట్టుకోవచ్చు.
గడువు తీరిన మందులను మీరు క్లీనింగ్ కోసం కూడా వాడొచ్చు. ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన యాంటీ బయాటిక్ క్రీమ్ లేదా లోషన్ తో ఫర్నీచర్ పై మరకలను, గీతలను పోగొట్టడానికి వాడొచ్చు. .
మీరు గార్డెనింగ్ లో కూడా గడువు తీరిన మందులను వాడొచ్చు. ఇవి పురుగుల మందుగా పనిచేస్తాయి. అయితే వీటిని పొడి చేసి నీళ్లలో కలిపి మొక్కలపై చల్లితే మొక్కలకు ఉన్న పురుగులు చనిపోతాయి.
కిచెన్ సింక్ ను క్లీన్ చేయడానికి కూడా మీరు ఓల్డ్ మందులను వాడొచ్చు. ఇందుకోసం మందుల్ని వేడి నీళ్లలో కలపాలి. దీనిలోనే బేకింగ్ సోడా కూడా వేసి సింక్ డ్రైనేజ్ లో పోసి కాసేపు అలాగే ఉంచాలి
ఈ మందులతో మీరు గిన్నెలను కూడా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం వేడినీళ్లలో ఓల్డ్ మందుల కవర్లు వేసి మరిగించండి. వీటిలో స్టీల్సి, సిల్వర్ గిన్నెల్ని కాసేపు ఉంచి తర్వాత క్లీన్ చేయండి.