Telugu

పాములంటే భయం

పాములంటే ప్రతీ ఒక్కరికీ భయం ఉంటుంది. అందుకే ఇంట్లోకి పాములు రాకుండా జాగ్రత్తలు పడుతుంటాం. ఇంట్లో కొన్ని మొక్కలుంటే పాములు అస్సులు రావు.
 

Telugu

రోజ్మేరీ

ఇంట్లో రోజ్మేరీ మొక్కలు ఉంటే పాములు అటుగా రావు. వీటి ఘాటైన వాసన వల్ల ఇంట్లో పెంచితే పాముల బెడద తగ్గుతుంది. 
 

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లి ఘాటైన వాసన, ఇతర గుణాలు పాములను తరిమికొట్టడానికి సహాయపడతాయి. దీన్ని నూరి, రసంగా కూడా వాడవచ్చు.

Image credits: Getty
Telugu

లావెండర్

ఇది అందం కోసం మాత్రమే కాదు, పాములను తరిమికొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది.దీని వాసన మనకు బాగానే ఉన్నా పాములకు నచ్చదు. 

Image credits: Getty
Telugu

మేరిగోల్డ్

మేరిగోల్డ్ పువ్వు వేర్లలో ఉండే సహజ సమ్మేళనాలు పాములను, ఇతర జీవులను, కీటకాలను తరిమికొడతాయి.
 

Image credits: Getty
Telugu

కాక్టస్

కాక్టస్ మొక్కల ముళ్ళు వల్ల పాములు వాటిని ఇష్టపడవు. కాబట్టి కాక్టస్ చూస్తే పాములు దరిచేరవు.
 

Image credits: Getty
Telugu

నిమ్మగడ్డి

నిమ్మగడ్డిలో సిట్రోనెల్లా ఉంటుంది. జీవులను, జంతువులను తరిమికొట్టడానికి ఇది సహాయపడుతుంది. ఇంటి ఆవరణలో పెంచితే పాములు రావు.

Image credits: Getty
Telugu

ఉల్లి

ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. దాని వాసన పాములకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇంటి ఆవరణలో ఇతర మొక్కలతో పాటు ఉల్లి కూడా పెంచడం మంచిది.
 

Image credits: Getty

గ్రీన్ శారీకి సూటయ్యే బెస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ఇవి..!

మదర్స్ డేకి మీ అమ్మకు నచ్చేలా ఈ బహుమతి ఇవ్వండి

Fashion tips: స్పెషల్ గా కనిపించాలంటే ఈ సారీస్ పక్కా ట్రై చేయాల్సిందే!

Skin Care: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి!