gardening

ఇంట్లో కలబంద మొక్క బాగా పెరగాలంటే ఇలా చేయండి

Image credits: Getty

ఇంట్లో కలబంద

కలబంద మొక్క  బాగా పెరగాలంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దానంతట అదే గుబురుగా పెరుగుతుంది. 

Image credits: Getty

మట్టి

కలబంద మొక్కలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మొక్కను బాగా నీరు ఇంకిపోయే మట్టిలో నాటాలి. 

Image credits: Getty

వేర్లు

కలబంద మొక్క బాగా పెరగాలంటే దీన్ని కొంచెం పెద్దగా ఉండే కుండీల్లోనే నాటాలి. అప్పుడే దాని వేర్లు బాగా పెరుగుతాయి. మొక్క బాగా విస్తరిస్తుంది. 

Image credits: Getty

నీరు పోయడం

మీకు తెలుసా? కలబంద మొక్కకు నీళ్లు ఎక్కువగా పోయకూడదు. ఎందుకంటే ఇది కూడా అన్ని మొక్కల్లాగే నీళ్లు ఎక్కువగా పోస్తే కుళ్లిపోతుంది. కాబట్టి నీళ్లను మరీ ఎక్కువగా పోయకండి. 

Image credits: Getty

ఎరువులు

కలబంద మొక్క బాగా పెరగడానికి ఎక్కువ ఎరువులు అవసరం లేదు. ఎరువులు ఎక్కువగా వేసారంటే ఇది పాడైపోతుంది. ఈ మొక్క ఎరువులు లేకుండానే పెరుగుతుంది. 

Image credits: Getty

సూర్యరశ్మి

కలబంద మొక్కను ఎప్పుడూ ఎండలో ఉంచకూడదు. ఈ మొక్క పెరగడానికి ఆరు గంటల ఎండ సరిపోతుంది. 

Image credits: Getty

కోత

కలబంద కాండాలు ఎక్కువగా పెరిగితే వాటిని కొత్త కుండీలోకి మార్చండి. అయితే కాండాలను కత్తిరించేటప్పుడు అన్నీ కలిపి కత్తిరించకండి. కొన్నింటిని వదిలేయడం చేయకండి. 

Image credits: Getty
Find Next One