gardening

లక్షల విలువ చేసే కాశ్మీరీ కుంకుమపువ్వును ఇంట్లో ఎలా పెంచాలో తెలుసా

కుంకుమపువ్వుతో అందం, ఆరోగ్యం

కుంకుమపువ్వును చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే వీటిని ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వాడుతారు. ఈ విలువైన కుంకుమ పువ్వు, అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

కుంకుమ పువ్వు

కాశ్మీర్‌లో ఎక్కువగా పండించే కుంకుమపువ్వు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అమ్ముడుపోయేది లక్షల్లో. ఈ ఖరీదైన పువ్వును ఇంట్లోనే ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఏరోపోనిక్ టెక్నిక్

కుంకుమ పువ్వును పండించడానికి ఏరోపోనిక్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇంట్లో ఖాళీ స్థలంలో ఒక నిర్మాణం చేయాలి. ఈ ప్లేస్ ఉల్లగా ఉండాలి. 

ఎలాంటి మట్టిని ఉపయోగించాలి

కుంకుమపువ్వును పండించడానికి ఇసుక నేల లేదా బంకమట్టిని ఉపయోగిస్తారు. ఈ మన్నుకు ఆవు పేడను కలుపుతారు.అలాగే పంటకు మంచి పోషణను ఇచ్చే ఎరువులను కూడా వాడుతారు. 

కుంకుమపువ్వు విత్తనాలు

పంటకోసం మట్టిని సిద్ధం చేసిన తర్వాత విత్తనాలను వేయాలి. అయితే దీనికి సూర్యుని ప్రత్యక్ష కిరణాలు పడకూడదు. ఎందుకంటే ఎండకు మొక్క ఎండిపోతుంది. 

నీళ్లు ఎలా పోయాలి

కుంకుమ పువ్వు మొక్కకు నీళ్లను ఎక్కువగా పోయకూడదు. ఈ మొక్కకు 15 రోజులకోసారి కొన్ని నీళ్లు పోయాలి. కుంకుమపువ్వు పువ్వు పూయడానికి 3-4 నెలలు టైం పడుతుంది. 

కుంకుమపువ్వు

ఈ మొక్క నుంచి ఒక్కొక్కటిగా కుంకుమపువ్వును తీయాలి. ఎందుకంటే కుంకుమపువ్వు ఒక్కో తంతువు ఎంతో ఖరీదైనది. కాబట్టి దీన్ని తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

కుంకుమ పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు

కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. లిబిడో,  లైంగిక పనితీరు మెరుగవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇంట్లో సంపదను పెంచే మనీ ప్లాంట్ ను పెంచే చిట్కాలు మీకోసం