విజయ్ ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా గిల్లి. తరణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ కి మొదటి 50 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా.
Telugu
పోకిరి
విజయ్ మాస్ ఇమేజ్ ని సృష్టించిన పోకిరి సినిమా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన సినిమా . ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా అసిన్ నటించారు.
Telugu
తుపాకి
విజయ్ కెరీర్ లో మొదటి 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం తుపాకి. ఈ చిత్రానికి ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించారు.
Telugu
కత్తి
కమర్షియల్ గానే కాకుండా మంచి సందేశం ఉన్న సినిమా కత్తి. ఈ చిత్రానికి కూడా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు.
Telugu
సర్కార్
విజయ్ ఒక రాజకీయ నాయకుడిగా ఏం చేయాలనుకుంటున్నారో తెరపై చూపించిన సినిమా సర్కార్. దీనికి కూడా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించారు.
Telugu
బిగిల్
విజయ్ కెరీర్ లో 300 కోట్ల వసూళ్లు రాబట్టిన మొదటి సినిమా బిగిల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా నయనతార నటించారు.
Telugu
మాస్టర్
విజయ్, లోకేష్ కనకరాజ్ తొలిసారి కలిసి పనిచేసిన సినిమా మాస్టర్. ఈ చిత్రం విజయ్ ని కొత్త కోణంలో చూపించి విజయం సాధించింది.
Telugu
వారసుడు
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి విజయ్ నటించిన చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
Telugu
లియో
విజయ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూలు చేసింది.
Telugu
ఖైదీ
విజయ్ నటనకు విందు భోజనంలాంటి సినిమా ఖైదీ. ఇందులో హీరోగానే కాకుండా విలన్ గా కూడా అదరగొట్టారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.