Entertainment
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక్క ఇండియాలోనే ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన మూడో హీరో అల్లు అర్జున్.
2017లో బాహుబలి 2 సినిమా 1,031 కోట్ల కలెక్షన్స్ తో ..మొదటి రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ను అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేస్తోంది.
విడుదలైన 16 రోజుల్లోనే భారతదేశంలో 1,020.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది పుష్ప 2. దీంతో కొత్త రికార్డు సృష్టించారు అల్లు అర్జున్.
పుష్ప 2పై ప్రేక్షకుల ఆసక్తి చల్లారలేదు. దీంతో ఆదివారం నాటికి 17 రోజుల్లో భారతదేశంలో మొత్తం వసూళ్లలో బాహుబలి 2ను పుష్ప 2 అధిగమిస్తుందని అంచనా.
దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు స్టార్లు ప్రభాస్, అల్లు అర్జున్ ఒకే ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో షారుఖ్ ఖాన్ కంటే వెనుకబడి ఉన్నారు.
షారుఖ్ పఠాన్ 543.22 కోట్లు, జవాన్ 640.42 కోట్లు, డంకీ 232 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. మొత్తంగా 1,415.64 కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించారు షారుఖ్.
భారతదేశంలో ఒకే ఏడాదిలో సినిమాల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన హీరో ప్రభాస్.
షారుఖ్ ఖాన్ మూడు సినిమాలతో 1,400 కోట్ల రూపాయలు వసూలు చేయగా, 2017లో ప్రభాస్ నటించిన ఒకే సినిమా బాహుబలి 2 భారతదేశంలో 1,031 కోట్ల రూపాయలు వసూలు చేసింది.