Entertainment

పుష్ప 2 బాక్సాఫీస్ అంచనా : RRR రికార్డ్ బద్దలవుతుందా?

‘పుష్ప 2’ తొలిరోజు రికార్డ్ సృష్టిస్తుందా?

‘పుష్ప 2: ది రూల్’ తొలిరోజు కొత్త రికార్డ్ సృష్టించనుంది. వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. 

‘పుష్ప 2’ భారతదేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్?

‘పుష్ప 2’ తొలి రోజు వసూళ్ల అంచనాలు నిజమైతే, అది దేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే చిత్రంగా నిలుస్తుంది.

పుష్ప 2 తొలిరోజు రేంజ్ ఎంతంటే

కొందరు ప్రముఖ విశ్లేషకులు  ‘పుష్ప 2’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 250-275 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

‘పుష్ప 2’ RRR ఓపెనింగ్‌ను అధిగమిస్తుందా?

‘పుష్ప 2’ 275 కోట్ల రూపాయలతో ప్రారంభమైతే, ప్రస్తుతం అతిపెద్ద ఓపెనర్ అయిన ‘RRR’ను అధిగమిస్తుంది, ఇది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 257 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 తొలి రోజు 100+ కోట్లు

తెలుగు రాష్ట్రాల్లోనే ‘పుష్ప 2’ తొలి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. మిగిలిన భారతదేశం నుంచి కూడా వసూళ్లు 100 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అంచనా.

మౌత్ టాక్ కీలకం

తొలి రోజు తర్వాత ‘పుష్ప 2’ బాక్సాఫీస్ పనితీరు మౌత్ టాక్ మీద ఆధారపడి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

‘పుష్ప 2’ తారాగణం

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరో తెలుసా?

సిల్క్ స్మిత 64వ జయంతి : అసలు పేరు, డెత్ మిస్టరీ, జీవితంలో వివాదాలు

అల్లు అర్జున్ టాప్ 5 సినిమాలు: ఒక్కటి కూడా 400 కోట్లు దాటలేదా?

ఈ విలన్ల భార్యలను చూశారా? అందంలో హీరోయిన్లకి తక్కువ కాదు