మమతా కులకర్ణి మహాకుంభ్‌కు వెళ్లారు, అక్కడ ఆమెను కిన్నెర అఖాడ మహామండలేశ్వర్‌గా నియమించారు. రకరకాల కారణాలతో ఏడు రోజులకే ఆ పదవిని ఆమె నుండి తొలగించారు.
మమత హిట్ సినిమాలు
మమతా కులకర్ణి బాలీవుడ్‌లో అత్యంత గ్లామరస్ నటీమణులలో ఒకరు. ఆమె తన సినీ జీవితంలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. వాటిలో ఒకటి కరణ్ అర్జున్.
సల్మాన్-షారుఖ్ లకు మందలింపు
కరణ్ అర్జున్ సినిమా షూటింగ్ సమయంలో ఒక డాన్స్ సీక్వెన్స్‌లో మమతా కులకర్ణి సల్మాన్, షారుఖ్ ఖాన్‌లను మందలించారు. వారిద్దరూ సరిగా చేయకపోవడంతో చెడామడా తిట్టారు.
డాన్స్ స్టెప్స్ పై కోపం
నిజానికి, భాంగ్రా పాలే.. పాట షూటింగ్ సమయంలో మమతా కులకర్ణి, సల్మాన్-షారుఖ్ ల డాన్స్ స్టెప్స్‌తో సంతృప్తి చెందలేదు. పదే పదే రీటేక్‌లు రావడంతో ఆమెకు కోపం వచ్చింది.
షాక్ అయిన హీరోలు
మమతా కులకర్ణి సల్మాన్-షారుఖ్ ఖాన్‌లను డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని రమ్మని చెప్పారట. ఇది విని ఇద్దరు హీరోలు షాక్ అయ్యారట.
బ్లాక్ బస్టర్ కరణ్ అర్జున్
దర్శకుడు రాకేష్ రోషన్ 1995లో తెరకెక్కించిన కరణ్ అర్జున్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్. సల్మాన్-షారుఖ్ ఖాన్ కలిసి నటించిన మొదటి సినిమా ఇది.