రోజుకు 20 సిగరెట్లు తాగే అలవాటున్న విశాల్.. ఒక్కరోజులో ఎలా మానేశారంటే
entertainment Jan 10 2025
Author: Narender Vaitla Image Credits:Instagram
Telugu
విశాల్ ఆరోగ్యంపై
గత కొన్ని రోజులుగా విశాల్ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పరిస్థితిని చూసిన అభిమానులు ఒకింత షాక్‌కి గురయ్యారు.
Image credits: Instagram
Telugu
సినిమా ఈవెంట్‌లో
మదగజరాజ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్ మాట్లాడే సమయంలో చేతులు వణుకుతూ కనిపించాయి. అలాగే ఆయన పూర్తిగా సన్నబడ్డారు కూడా.
Image credits: Instagram
Telugu
భయపడాల్సింది ఏం లేదంటూ
అయితే విశాల్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని ఇప్పటికే ఖుష్బుతో పాటు నటుడు జయంరవి సైతం స్పందించారు. కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే అని తెలిపారు.
Image credits: Instagram
Telugu
నెట్టింట వైరల్
ఇదిలా ఉంటే విశాల్‌కు సంబంధించిన పాత వీడియోలు కొన్ని నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో భాగంగానే పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Image credits: Instagram
Telugu
స్మోకింగ్
గతంలో తాను విపరీతంగా సిగరెట్స్ కాల్చేవాడినని, రోజుకు ఏకంగా 20 సిగరెట్స్ కాల్చేవాడినని కానీ దానిపై చిరాకు పుట్టగానే కేవలం ఒక్క రోజులోనే ఆ అలవాటును మానుకున్నానని తెలిపారు.
Image credits: Instagram
Telugu
ఆల్కహాల్ కూడా
ఆల్కహాల్ అలవాటును కూడా అలాగే మానేశానని తెలిపారు. చాలా మంది ఏదైనా బ్యాడ్ హ్యాబిట్‌ను నెమ్మదిగా తగ్గించుకోవాలని చెబుతుంటారని. కానీ తాను మాత్రం ఒక్క రోజులోనే మానేశానన్నారు
Image credits: Instagram
Telugu
విల్ పవర్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విల్ పవర్ ఉంటే ఎలాంటి అలవాటైనా మానొచ్చని విశాల్ చేసి చూపించారు. ఇక విశాల్ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.