Entertainment

పుష్ప 2: అల్లు అర్జున్ పై 3 కేసులు

వివాదంలో అల్లు అర్జున్

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ బయట 'పుష్ప 2' ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.

డిసెంబర్ 4 ఘటన:

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో పుష్ప 2 షో వేశారు.  జనాలు ఎక్కువై తొక్కిసలాట జరిగి 39 ఏళ్ల మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.

అల్లు అర్జున్ పై 2024లో 3వ కేసు

2024 సంవత్సరం అల్లు అర్జున్ కి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది. ఈ సంవత్సరం ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి.

నవంబర్ 30న

గ్రీన్ పీస్ ట్రస్ట్ కు చెందిన  శ్రీనివాస్ గౌడ్, అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. అల్లు అల్లు ఆర్మీ అనిపెట్టి.. సైన్యాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపించారు. 

ఎన్నికల నియమావళి ఉల్లంఘన

ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది.

ఎన్నికల నియమాల ఉల్లంఘన కేసు ఏమిటి?

ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్ప్ రవిచంద్ర రెడ్డిని కలవడానికి వెళ్లారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు చేశారని కేసు నమోదు చేశారు. .

జానీమాస్టర్ కేసు

సెప్టెంబర్ లో, 'పుష్ప 2' సినిమా కొరియోగ్రఫర్  జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల  కేసులో అరెస్ట్ అయ్యారు. జానీ భార్య అల్లు అర్జున్, సుకుమార్ పేర్లను ఈ కేసులోకి లాగారు.

వర్కింగ్ ఉమన్ కి శిల్పా శెట్టి చెప్పిన 7 విలువైన సూత్రాలు 

సోనమ్ కపూర్ విలాసవంతమైన ఇంటిని చూశారా!

కోట్లు సంపాదిస్తూ అద్దె ఇంట్లో ఉండే సినీ తారలు వీళ్ళే

2024లో బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప 2.. కల్కి రికార్డుని బ్రేక్ చేసేసింది