అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా ఆయన కామెడీ సినిమాల గురించి మీకు పరిచయం చేస్తున్నాం.
Telugu
1. హేరా ఫేరీ
2000లో వచ్చిన ‘హేరా ఫేరీ’ కామెడీ సినిమా. చూస్తే నవ్వు ఆపుకోలేరు. పరేష్ రావల్, సునీల్ శెట్టి కూడా నటించారు.
Telugu
2. ఆవారా పాగల్ దీవానా
2002లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా ‘ఆవారా పాగల్ దీవానా’. ఇందులో కూడా కామెడీ పండుగే. పరేష్ రావల్, సునీల్ శెట్టి ఇందులోనూ నటించారు.
Telugu
3. గరం మసాలా
2005లో వచ్చిన ‘గరం మసాలా’ సినిమా చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. జాన్ అబ్రహం తో కలిసి చేసిన ఈ సినిమాలో కామెడీ బాగుంటుంది.
Telugu
4. ఫిర్ హేరా ఫేరీ
2006లో వచ్చిన ‘ఫిర్ హేరా ఫేరీ’లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. ఈ సినిమా చూస్తే నవ్వు ఆపుకోలేరు. సునీల్ శెట్టి, పరేష్ రావల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
Telugu
5. భాగమ్ భాగ్
2006లో వచ్చిన ‘భాగమ్ భాగ్’ సినిమాలో సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా బాగుంటుంది. అక్షయ్ తో పాటు గోవిందా, పరేష్ రావల్ ముఖ్య పాత్రలు పోషించారు.
Telugu
6. వెల్కమ్
2007లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా ‘వెల్కమ్’లో అదిరిపోయే కామెడీ ఉంటుంది. ఈ సినిమాలో విలన్ కూడా కామెడీ చేస్తాడు.
Telugu
7. సింగ్ ఈజ్ కింగ్
2008లో వచ్చిన అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ సినిమా ‘సింగ్ ఈజ్ కింగ్’ నవ్వులే నవ్వులు. సోనూ సూద్, ఓం పురి నవ్వుల్లో పాలుపంచుకున్నారు.