భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2025తో దుమ్మురేపుతున్న గిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.
గిల్ తో ప్రేమలో ఉన్నారని చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు పేర్లు వినిపించాయి. కానీ, గిల్ అధికారికంగా ఈ రూమర్లపై ఏ కామెంట్స్ చేయలేదు.
ఇప్పుడు శుభ్‌మన్ తర్వాత అభిషేక్ శర్మ ఈ జాబితాలో చేరారు. అభిషేక్ అభిమానుల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తే, ఆయన త్వరలోనే గిల్‌ను అధిగమించవచ్చు.
క్రికెటర్ అభిషేక్ శర్మ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లకు కొత్త క్రష్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా ఒక నటి అతనిపై ప్రశంసలు కురిపించింది.
బాలీవుడ్ నటి సోనల్ చౌహాన్ ఫిల్మీజ్ఞాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, రోహిత్, విరాట్ రిటైర్ అయిన తర్వాత గిల్, అభిషేక్ వారి స్థానాన్ని భర్తీ చేస్తారని అన్నారు.
అభిషేక్ శర్మను చూస్తే, ఆయన టీమ్ ఇండియాకు మంచి భవిష్యత్తు అని అనిపిస్తుందని సోనల్ అన్నారు. ఆయన శైలి చాలా బాగుందని అన్నారు.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన జన్నత్ సినిమాతో సోనల్ చౌహాన్‌కు గుర్తింపు వచ్చింది, ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో కలిసి అద్భుతమైన నటన కనబరిచారు.