మీరు విదేశాల్లో స్థిరపడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ లిస్ట్ మీకోసమే. GoOverseas డేటా ప్రకారం 2026లో భారతీయులకు కెరీర్, నివాసం రెండింటికీ అద్భుతంగా ఉన్న టాప్ దేశాలు ఏవో చూద్దాం.
ఆధునిక, వ్యవస్థీకృత జీవితం కావాలనుకుంటే నెదర్లాండ్స్ మంచి ఆప్షన్. ఇక్కడి నగరాలు అంతర్జాతీయ బిజినెస్, స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్నాయి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, K-కల్చర్ కారణంగా దక్షిణ కొరియా పాపులర్ అయింది. ఇక్కడ టెక్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి.
విదేశీయులకు ఆస్ట్రేలియా ఎప్పటినుంచో ఫేవరెట్ డెస్టినేషన్. ఇక్కడ హెల్త్‌కేర్, ఐటీ, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్‌లో గొప్ప అవకాశాలు లభిస్తాయి.
జర్మనీ యూరప్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఇంజనీరింగ్, ఐటీ, రీసెర్చ్, మాన్యుఫ్యాక్చరింగ్‌లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.
కొత్త సంస్కృతిని ఇష్టపడే వారికి బ్రెజిల్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ, అగ్రికల్చర్, క్రియేటివ్ ఇండస్ట్రీస్‌లో అవకాశాలు లభిస్తాయి.
డెన్మార్క్ తన హ్యాపీనెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఫార్మా రంగాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఇది కాస్త ఖరీదైన దేశం.