2026లో ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏ బ్రాంచ్ ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? మీ కెరీర్‌ను మార్చేసే టాప్ 5 బ్రాంచుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఇప్పుడు ఇంజినీరింగ్ కేవలం థియరీకి పరిమితం కాలేదు. AI, డేటా, కొత్త టెక్నాలజీపై అవగాహనతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న ఇంజినీర్లనే కంపెనీలు కోరుకుంటున్నాయి.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE)కు అన్ని రంగాల్లోనూ డిమాండ్ ఉంది. ఈ బ్రాంచ్ ద్వారా సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, AI వంటి రంగాల్లో అద్భుతమైన కెరీర్ అవకాశాలు లభిస్తాయి.