రాఖీ కట్టినందుకు ఇలాంటి గిఫ్ట్‌లిస్తే డబుల్ హ్యాపీ
ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి
అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ఆగస్టు 19న చేసుకుంటాం. ఈ సందర్భంగా మీ చెల్లిని ఆర్థికంగా బలోపేతం చేసే గిఫ్ట్‌లు ఇవ్వవచ్చు. ఇక్కడ జాబితా చూడండి…
బంగారు నాణెం
గిఫ్ట్‌గా బంగారు నాణెం ఇవ్వడం మంచి ఎంపిక. ఇది మీ సోదరికి అందమైన, మన్నికైన బహుమతిగా ఉంటుంది. ఇది ఆమె కష్ట సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది.
మ్యూచువల్ ఫండ్
SIP ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని నుండి మంచి రాబడిని కూడా పొందవచ్చు. ఇది మీ సోదరికి డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది.
ETF
మీరు మీ సోదరికి ETF షేర్లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు వాటిని మీ బ్రోకరేజ్ ఖాతా నుండి బదిలీ చేయవచ్చు.
PPF - పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
PPF మంచి బహుమతిగా ఉంటుంది. ప్రతి నెలా రూ.500 జమ చేస్తే 15 ఏళ్లలో రూ.1.6 లక్షలు జమ అవుతాయి. ఇది మీ సోదరి వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుంది.