business

Ola e-బైక్ రోడ్‌స్టర్ లుక్ అదిరిపోయిందిగా..

మూడు మోడళ్లలో ఓలా తొలి ఎలక్ట్రిక్ బైక్

ఓలా ఎలక్ట్రిక్ తన తొలి E-Bike రోడ్‌స్టర్‌ను లాంచ్ చేసింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్ ప్రో అనే మూడు మోడళ్లను కంపెనీ విడుదల చేసింది.

రోడ్‌స్టర్ X ఎక్స్-షోరూమ్ ధర రూ.74,999

రోడ్‌స్టర్ X బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,999. అత్యధిక వేరియంట్ రోడ్‌స్టర్ ప్రో ధర రూ.2.49 లక్షలు.

రోడ్‌స్టర్ ప్రో టాప్ వేరియంట్ మైలేజీ

రోడ్‌స్టర్ ప్రో టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 579 కి.మీ. ప్రయాణిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. బైక్ బుకింగ్స్ ప్రారంభం కాగా, 2025 జనవరి నుంచి డెలివరీలు జరుగుతాయి.

రోడ్‌స్టర్ X మూడు బ్యాటరీ ప్యాక్‌లలో లభ్యం

రోడ్‌స్టర్ X ఎంట్రీ లెవల్ వేరియంట్ 2.5kWh, 3.5kWh, 4.5kWh బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ.74,999, రూ.84,999, రూ.99,999 (ఎక్స్-షోరూమ్).

2.8 సెకన్లలో 0-40 కి.మీ. వేగం

4.5kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ కేవలం 2.8 సెకన్లలో 0-40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 124 కి.మీ. ఫుల్ ఛార్జ్‌తో 200 కి.మీ. ప్రయాణిస్తుంది.

రోడ్‌స్టర్ మిడ్ వేరియంట్ ధర

రోడ్‌స్టర్ మిడ్ వేరియంట్‌ను 3kWh, 4.5kWh, 6kWh బ్యాటరీ ప్యాక్‌లతో కంపెనీ లాంచ్ చేసింది. వీటి ధర వరుసగా రూ.1,04,999, రూ.1,19,999, రూ.1,39,999 (ఎక్స్-షోరూమ్).

2 సెకన్లలో 0-40 వేగం

6kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ కేవలం 2 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ 126 కి.మీ. ఫుల్ ఛార్జ్‌పై 248 కి.మీ. రేంజ్ ఉంటుంది.

రోడ్‌స్టర్ టాప్ మోడల్ ధర

రోడ్‌స్టర్ టాప్ మోడల్‌ను 8kWh, 16kWh బ్యాటరీ ప్యాక్‌లలో కంపెనీ లాంచ్ చేసింది. వీటి ధర వరుసగా రూ.1,99,999, రూ.2,49,999 (ఎక్స్-షోరూమ్).

1.2 సెకన్లలో 0-40kmph వేగం

రోడ్‌స్టర్ ప్రో 16kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కేవలం 1.2 సెకన్లలో 0-40kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 194kmph. ఫుల్ ఛార్జ్‌పై 579 కి.మీ. రేంజ్ లభిస్తుంది.

అమితాబ్‌కు గంటకు రూ. 5 కోట్లు!

Today Gold Rate: ఆగస్టు 12న బంగారం ధరలు,ఏ నగరంలో ఎంత ఉందంటే

Amazon, Flipkart SALE 2024: "ఇది" మోసం గురూ!!

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?