business
బంగారం స్వచ్ఛతను 24K, 22K, 18Kలలో కొలుస్తారు.
24 క్యారెట్ బంగారం అంటే 100 స్వచ్ఛమైన బంగారం. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. దీనిని 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అంటారు.
22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. 22K బంగారంలో వెండి, జింక్, నికెల్ కలుపుతారు. దీనిని 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం అంటారు.
18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం ఉంటుంది. ఇందులో రాగి, వెండి వంటి లోహాలు ఉంటాయి. దీన్ని గొలుసులు, ఉంగరాల తయారీకి వాడుతారు..
బంగారం లేదా దానితో చేసిన నగలను కొనుగోలు చేసినప్పుడల్లా, మీరు దానిపై BIS గుర్తును తనిఖీ చేయాలి.
భారతదేశంలోని ఏకైక ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా హాల్‌మార్క్ నిర్ణయించబడుతుంది.
బంగారు ఆభరణాలపై కొన్ని చుక్కల వెనిగర్ వేయండి. 15 నిమిషాల తర్వాత మీ నగలను తనిఖీ చేయండి. దాని రంగులో మార్పు లేకుంటే, మీ బంగారం స్వచ్ఛమైనదని అర్థం చేసుకోండి.
దుకాణం నుండి ధృవీకరించబడిన రసీదు తీసుకొని, విశ్వసనీయ స్థలం నుండి మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయండి.
బంగారం నగ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, అంతే జాగ్రత్తగా రశీదును కూడా చూసుకోవాలి. లేకపోతే భారీగా నష్టపోతారు..