business

కోటి రూపాయల లాటరీపై ఎంత పన్ను విధిస్తారు..

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, లాటరీ లేదా గేమ్ షోలో గెలిచిన ఏదైనా బహుమతిపై పన్ను విధిస్తారు.

కోటి రూపాయల లాటరీపై ఎంత పన్ను ?

1 కోటి రూపాయల లాటరీ విజేతలపై 30 శాతం పన్ను వసూలు చేస్తారు..

ఎంత పన్ను చెల్లించాలి..?

లాటరీ లేదా గేమ్ షోలో 1 కోటి రూపాయలు గెలిస్తే, అందులో 30 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాలి.  

ఎన్ని రకాల పన్నులు వేస్తారు..?

10 శాతం అదనపు సర్‌చార్జి కూడా చెల్లించాలి. ఎడ్యుకేషన్ సెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ వంటి పన్నులు కూడా చెల్లించాలి. 

పన్ను మనం కట్టాలా..? లాటరీ సంస్థ కడుతుందా..?

ఈ పన్నులన్నింటినీ కట్ చేసే బాధ్యత కూడా మీరు ప్రైజ్ మనీని గెలుచుకున్న సంస్థపై ఉంటుంది.

1 కోటిలో ఎంత మిగులుతుంది..?

1 కోటి నుండి 30 లక్షలు తీసివేస్తే. 70 లక్షలు మిగులుతుంది..

సర్ చార్జీ ఎంత ?

దీనిపై 10 శాతం సర్ ఛార్జీ విధిస్తే, మరో 3 లక్షలు కలిసి మొత్తం పన్ను మొత్తం 33 లక్షలు అవుతుంది.

సెస్ ఎంత...?

ఆపై 4 శాతం సెస్ అంటే 1లక్ష 20వేలు.. అంటే మొత్తం రూ. 34.2 లక్షలు. 

చివరకు మిగిలేది ఎంత..?

1 కోటి మొత్తంపై అన్ని పన్నులు చెల్లించిన తర్వాత, మొత్తం 65 లక్షలు విజేతకు దక్కుతాయి.

Find Next One