2024లో రికార్డ్స్ క్రియేట్ చేసిన టాప్ 5 కార్లు ఇవే!
Image credits: Google
హ్యుండై క్రెటా
కొత్త క్రెటా జనవరి 2024లో లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 11 లక్షల నుండి రూ. 20.45 లక్షల వరకు ఉంది. నెలకు 15,000 కార్లకు పైగా అమ్ముడై మిడ్-SUV సెగ్మెంట్లో రికార్డులు బద్దలుకొట్టింది.
Image credits: Google
టాటా పంచ్ EV
జనవరి 2024లో లాంచ్ అయిన పంచ్ EV, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిపింది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Image credits: Google
మహీంద్రా థార్ రోక్స్
ఒక గంటలో 1.76 లక్షల బుకింగ్స్ తో మహీంద్రా థార్ రోక్స్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆగస్టు 2024లో లాంచ్ అయిన ఈ థార్ లో ఐదు డోర్ల వెర్షన్ రావడంతో బాగా ఫేమస్ అయ్యింది.
Image credits: Google
మారుతి సుజుకి డిజైర్
డిజైర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్. కొత్త జనరేషన్ మోడల్ నవంబర్ 2024లో లాంచ్ అయ్యింది. దీని ధర రూ.6.79 లక్షల నుండి ప్రారంభం. 5 స్టార్ రేటింగ్ పొందిన కారు ఇది.
Image credits: Google
MG విండ్సర్ EV
విండ్సర్ EV సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యింది. మీరు దీన్ని కేవలం రూ.9.99 లక్షలకు పొందవచ్చు. అక్టోబర్, నవంబర్ లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇది.