Astrology
బెడ్రూమ్ లో బెడ్ కి ఎదురుగా అద్దం ఉంటే వాస్తు దోషం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, సరైన సైజు, దిశలో ఉంటే దోషం ఉండదట.
అద్దం సైజు 4 అడుగుల కన్నా తక్కువ ఉంటే, వాస్తు దోషం రాదు. దాన్ని మామూలుగా వాడుకోవచ్చు.
అద్దం సైజు 4 అడుగుల కన్నా పెద్దగా ఉంటే, దాన్ని ఉత్తర, తూర్పు దిశలో పెట్టాలి. ఈ దిశలు శుభప్రదం, చెడు ప్రభావం ఉండదు.
మీ అద్దం దక్షిణ దిశలో ఉంటే, దాన్ని తీసేయకుండా ఆ గోడకి పసుపు రంగు వేయండి. దీనివల్ల శక్తి సానుకూలంగా ఉంటుంది, చెడు ప్రభావం ఉండదు.
అద్దాన్ని మంచం ఎదురుగా నుంచి తీసేయలేకపోతే, దాన్ని గుడ్డతో కప్పేయండి. అప్పుడు మీ నీడ అద్దంలో కనిపించదు, చెడు ప్రభావం ఉండదు.