Astrology
మనకు నిత్యం కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కల మన నిజ జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు.
మనకు వచ్చే కలలు మన మనస్సులో అణిచి వేసిన ఫీలింగ్స్‌కు ప్రతిరూపమని మానసిక నిపుణులు సైతం చెబుతుంటారు. డ్రీమ్ సైన్స్‌లో ఇందుకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఒకవేళ పది మందిలో నగ్నంగా ఉన్నట్లు మీ కలలో కనిపిస్తే మీలో ఏదో తెలియనని అభద్రత భావం ఉన్నట్లు అర్థం. తెలిసో తెలియకో చేసిన తప్పు మిమ్మల్ని వేధిస్తుందని అర్థం చేసుకోవాలి.
రోడ్డుపై నగ్నంగా నడుస్తున్నట్లు కనిపిస్తే మీరు అంతర్ముఖులు అని అర్థం. అంటే ఇతరులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడరు. మీతో మీరే అన్నట్లు ఉంటుంది మీ ప్రపంచం.
ఒకవేళ ప్రని చేసే ప్రదేశంలో నగ్నంగా ఉన్నట్లు కలలో కనిపిస్తే.. మీరు ఆ పని పట్ల సంతోషంగా లేరని అర్థం చేసుకోవాలి. మీ పనిపట్ల మీకు సంతృప్తి లేదని అర్థం.
మీరు ఒంటరిగా ఒక మూలన కూర్చొని నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తే.. మీ భావోద్వేగాలను అణిచి వేసుకుంటున్నారని అర్థం. ఇతరులతో దూరంగా ఉంటే ఇలాంటి కలలు వస్తాయని అంటారు.
ఈ విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.