Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రోజు కొత్త బట్టలను కొంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం నాడు బట్టలను కొనొచ్చు. ఎందుకంటే ఈ రోజు శుక్ర గ్రహానికి సంబంధించినది. కాబట్టి శుక్రుని వల్ల జీవితంలో సౌకర్యాలు, అవకాశాలు పెరుగుతాయి.
జ్యోతిష్యుల ప్రకారం.. శుక్రవారం నాడు దుస్తులను కొంటే మీకు అదృష్టం కలిసొస్తుది. అందుకే శుక్రవారం నాడు కొనే ప్రతి వస్తువు మీకు మేలు చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్యం ప్రకారం.. ఒక్క శుక్రవారమే కాకుండా అశ్విని, చిత్త, రోహిణి వంటి శుభ నక్షత్రాల్లో కూడా కొత్త దుస్తులను కొనొచ్చు. వేసుకోవచ్చు. దీనివల్ల మీకు అదృష్టం పెరుగుతుంది.
జ్యోతిష్యం ప్రకారం.. శనివారం నాడు కొత్త బట్టలను కొనకూడదు. ఎందుకంటే మీరు శని ప్రభావానికి లోనవుతారు. అలాగే ఈ రోజు దుస్తులను దానం చేయడం కూడా మంచిది కాదు.
జ్యోతిష్యం ప్రకారం.. కాలిన, చిరిగిన దుస్తులను ఇంట్లో ఉంచకూడదు. వేసుకోకూడదు. దీనివల్ల రాహువు దుష్ప్రభావాలు మీ జీవితంలో కలుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది.