రోడ్డు మీద ఫ్రెండ్ తో కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే ఓ అందంగా ముస్తాబైన అమ్మాయి కనపడింది. ఆమెవైపు కన్నార్పకుండా చూశాడు. అతని మనసులోని కోరికను కనిపెట్టిన సదరు అమ్మాయి.. నాతో వస్తే కోరిక తీరుస్తానంటూ ఆఫర్ ఇచ్చింది. భలే మంచి గిరాకీ అనుకుంటూ.. కొంత మొత్తానికి బేరం కుదుర్చుకొని తన స్థావరానికి అతనిని తీసుకువెళ్లింది. సరదాగా శారీరక కోరిక తీర్చుకుందామని వెళ్లిన అతనికి అక్కడికి వెళ్లగానే ఊహించని షాక్ తగిలింది. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామెరూన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి దుబాయి వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూడగానే ఆకర్షించేలా ఓ అమ్మాయి కనపడింది. ఆమె వృత్తి వ్యభిచారం కావడంతో.... ఈ వ్యక్తికి సైగ  చేసింది. అతను కూడా ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు.

Also Read నన్నే ఏడిపిస్తావా...? డాక్టర్ ని ఉరుమురిమి చూసిన బుడ్డోడు.. ఫోటో వైరల్...

వెంటనే 80దిర్హామ్ లకు బేరం కుదుర్చుకున్నాడు. ఆమె వెంటనే వెళ్లాడు. తన స్నేహితుడిని బయట ఉండమని చెప్పి తాను మాత్రం సదరు మహిళతో కలిసి లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే.. సదరు మహిళతో మరో స్త్రీ కూడా ఉండటాన్ని గమనించాడు. వారిద్దరూ కలిసి.. అతనిని మాయ చేశారు. అతని పర్స్ కాజేశారు.

కాసేపటికి తాన పర్స్ వాళ్లు కాజేశారన్న విషయం తెలుసుకున్నాడు. తన పర్స్ తనకి ఇచ్చేయాలంటూ వాళ్లను కోరాడు. వాళ్లు పర్స్ ఇవ్వకపోగా.. అతనిపై వాదులాటకు దిగారు. దౌర్జన్యం చేసి బయటకు పంపించేయాలని చూశారు. ఇక వీళ్ల దగ్గర నుంచి పర్స్ తీసుకోవడం కష్టమని భావించిన అతను.. వెంటనే బయట ఉన్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు.

ఆ ఇద్దరు మహిళల బారి నుంచి తన స్నేహితుడిని కాపాడేందుకు ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. ఇంకేముంది సీన్ రివర్స్ అయిపోయింది. పోలీసులు వచ్చి..  ఆ ఇద్దరు మహిళలతోపాటు...వాళ్ల వద్దకు వచ్చిన ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. కాసేపు శారీరక సుఖం కోసం కక్కుర్తి పడి పరాయి దేశంలో పోలీసులకు చిక్కాడు. అక్కడితో ఆగిపోలేదు.. అతని ఉద్యోగం కూడా పోయింది ఈ దెబ్బతో. కాగా.. సదరు మహిళలు నైజీరియాకు చెందినవారుగా గుర్తించారు.