Asianet News TeluguAsianet News Telugu

మరికాసేపట్లో హాజీపూర్ సీరియల్ రేప్ హత్య కేసులో కోర్టు తీర్పు

హజీపూర్ సీరియల్  హత్యలపై గురువారం నాడు తీర్పును వెల్లడించనుంది. 

Verdict in Hajipur murder case on feb 6, 2020
Author
Nalgonda, First Published Feb 6, 2020, 11:24 AM IST

నల్గొండ: హజీపూర్ సీరియల్ రేప్, హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి  నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం నాడు శిక్ష విధించనుంది. 

గురువారం నాడు ఉదయం కోర్టులో  నిందితుదు శ్రీనివాస్ రెడ్డిని రాచకొండ పోలీసులు ప్రవేశపెట్టారు.  కోర్టుకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ కూడ  హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్పారు.

ఈ కేసుపై తుది తీర్పు వెలువడే నేపథ్యంలో హాజీపూర్ గ్రామస్తులు కూడ  నల్గొండ కోర్టుకు చేరుకొన్నారు. గురువారం నాడు ఉదయం కోర్టులో రాచకొండ పోలీసులు ప్రవేశపెట్టారు.  కోర్టుకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ కూడ  హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్పారు. ఈ కేసుపై తీర్పు వెలువడే నేపథ్యంలో హాజీపూర్ గ్రామస్తులు కూడ  నల్గొండ కోర్టుకు చేరుకొన్నారు. 

90 రోజుల్లో ఈ కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు. 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ని ఉరి తీయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాసిక్యూషన్ కూడ నిందితుడికి ఉరి శిక్ష విధఇంచాలని డిమాండ్ చేసింది.

Also read: హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్: తీర్పు 6వ తేదీకి వాయిదా

2019 ఏప్రిల్ 24వ తేదీన శ్రావణి హత్య కేసుతో మర్రి శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగు చూశాయి.  నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పనను కూడ మర్రి శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టుగా ఒప్పుకొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు.

2019 జూన్‌లో మనీషా, శ్రావణిలు అదృశ్యమయ్యారు. శ్రీనివాస్ రెడ్డిపై 2019 జూలై 31న తొలికేసు నమోదైంది. మూడు కేసులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా ఛార్జీషీట్ దాఖలు చేశారు.  ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన ఫోక్సో కోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. 

ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 19వ తేదీవరకు  వాదనను విన్పించింది ప్రాసిక్యూషన్. అదే ఏడాది డిసెంబర్ 26న నిందితుడికి సాక్ష్యాలను న్యాయస్థానం విన్పించంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన నిందితుడి వాదనను కూడ కోర్టు తెలుసుకొంది.అయితే ముగ్గురు  బాలికలు ఎవరో తనకు తెలియదని నిందితుడు కోర్టుకు వివరించారు. నిందితుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమార్పించారు. 

అయితే శ్రావణిని హత్య  చేసినట్టుగా తొలిసారిగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారు. ఆ తర్వాత అదే బావిలో మనీషా మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తే మనీషాను చంపినట్టుగా ఒప్పుకొన్నారు.

మరో వైపు నాలుగేళ్ల క్రితం కల్పనను హత్య చేసినట్టుగా కూడ శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారని పోలీసులు ప్రకటించారు. హాజీపూర్‌లో  ముగ్గురు  విద్యార్ధినులను హత్య చేసిన  శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా అడవుల్లో తిరిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.

చిన్నతనం నుండే శ్రీనివాస్ రెడ్డికి దొంగతనాలు చేసే అలవాటు ఉందని గ్రామస్తులు చెప్పారు.. అయితే దొంగతనాలు చేసిన సమయంలో  కుటుంబసభ్యులు శ్రీనివాస్ రెడ్డిని వారిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో తక్కువగా శ్రీనివాస్ రెడ్డి ఉండేవాడని  గ్రామస్థులు అంటున్నారు. కీసరలో మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి  రాత్రి పూట ఇంటికి వచ్చి ఉదయం పూట వెళ్లేవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

గ్రామంలో ఎప్పుడైనా ఉంటే మాత్రం ఒంటరిగా ఆయన సంచరించేవాడని  గ్రామస్థులు చెబుతున్నారు. నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే తిరిగే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు.

శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన వ్యవసాయ బావుల వద్ద కూడ అప్పుడప్పుడూ శ్రీనివాస్ రెడ్డి సంచరించేవాడని గ్రామస్తులు అంటున్నారు.ఇటీవలనే శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు భూమిని విక్రయించారు. దీనికి సంబంధించిన డబ్బు కూడ రావడంతో జల్సాలు చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.

డ్రగ్స్‌ కూడ శ్రీనివాస్ రెడ్డి అలవాటు పడ్డాడని కొందరు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది


 

Follow Us:
Download App:
  • android
  • ios