నల్లగొండ: హజీపూర్ వరుస అత్యాచారాలు, హత్య కేసులో తుది తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో తీర్పు సోమవారం వెలువడాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి తీర్పును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. భువనగిరి యాదాద్రి జిల్లాలోని హజీపూర్ లో ముగ్గురు బాలికలు అత్యాచారానికి, హత్యకు గురైన విషయం తెలిసిందే. 

ఈ కేసుల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డిని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నిరుడు అక్టోబర్ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు న్యాయస్థానం వాదనలు విని తీర్పును ఈ నెల 27వ తేదీకి రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా 101 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. 

Also Read: నాకు మగతనమే లేదు: హజీపూర్ సీరియల్ రేపిస్ట్ ట్విస్ట్

2015 నుంచి గ్రామంలో కనిపించకుండా పోయిన మనీషా, కల్పన, శ్రావణి అనే బాలికలపై శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి, వారిని హత్య చేసి బావుల్లో పడేషశాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. బావిలో తవ్వకాలు జరిపి పోలీసులు మృతదేహాల ఆనవాళ్లను వెలికి తీశారు 

ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్షకు అర్హుడని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది అన్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఈ దారుణాలకు ఒడిగట్టిన ఇటువంటి వ్యక్తి సమజాంలో ఉండడం క్షేమం కాదని అన్నారు. 

Also Read: హాజీపూర్ తుది తీర్పు: సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరేనా, తీర్పుపై ఉత్కంఠ..!!