టాలీవుడ్ డ్రగ్స్ కేసు: తరుణ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. నేటీతో 12 మంది సినీ ప్రముఖుల విచారణ పూర్తి
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయంలో ఆయనను 8 గంటల పాటు విచారించారు అధికారులు. నేటితో డ్రగ్స్ కేసులో సినీ తారల విచారణ ముగిసినట్లయ్యింది. ఇక తన బ్యాంక్ ఖాతాల స్టేట్‌మెంట్లతో హాజరయ్యారు 12 మంది సినీ ప్రముఖులు.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభించింది. తరుణ్‌తో ఈ విచారణ ముగిసింది. ఇక ఆగస్టు 31న పూరీ జగన్నాథ్‌ను దాదాపు 10 గంటల పాటు విచారించింది ఈడీ. ఈ నెల 2న ఛార్మీని 8 గంటల పాటు విచారించింది. అయితే ఈ నెల 6న రకుల్ ప్రీత్ సింగ్ హాజరవ్వాల్సి వుండగా.. 3వ తేదీనే విచారణకు వెళ్లింది రకుల్. 6 గంటల పాటు ఆమెను విచారించారు అధికారులు.
ALso Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. 16 మందికి క్లీన్ చీట్..
ఇక 20వ తేదీన హాజరుకావాల్సిన నందు ఈ నెల 7న విచారణకు వచ్చారు. అదే రోజు డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ , జిశాన్‌ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు అధికారులు. 8వ తేదీన రానాను విచారించారు. అయితే రానా, నందు విచారణకు హాజరైన రోజే కెల్విన్, జీశాన్‌లను కలిపి విచారించింది ఈడీ. ఈ నెల 9 రవితేజతో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్‌ను , 13న నవదీప్‌తో పాటు ఎఫ్ లాంజ్ క్లబ్ మేనేజర్‌ను ప్రశ్నించారు. 15న ముమైత్ ఖాన్, 17న తనీష్‌ను ఏడు గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. అయితే విచారణకు తమ ఛార్టెట్ అకౌంటెట్లను తీసుకొచ్చారు పలువురు ప్రముఖులు