Asianet News TeluguAsianet News Telugu

అమీన్ పూర్ లో మైనర్ బాలిక రేప్, హత్య: ముగ్గురికి జీవిత ఖైదు విధింపు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో గల బాలికల సంరక్షణ కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. వేణుగోపాల్ రెడ్డి, జయదీప్, విజయలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 

Sangareddy Pocso Court order life sentence to Three Convicts
Author
First Published Sep 29, 2022, 4:50 PM IST

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో  మైనర్ బాలికపై అత్యాచారం , హత్య ఘటనలో ఫోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముగ్గురికి జీవిత ఖైదును విధించింది. 2020లో అమీన్ పూర్ లో గల బాలికల సంరక్షణ కేంద్రంలో బాలికపై అత్యాచారం చేయడంతో ఆమెను హత్య చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముగ్గురిని  కోర్టు దోషులుగా తేల్చింది. వేణుగోపాల్ రెడ్డి, విజయ, జయదీప్ లకు జీవిత ఖైదు విధించింది. 

2020 ఆగస్టు మాసంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ఆశ్రమంలో ఉన్న బాలికను స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు కాచిగూడలోని వసతి గృహనికి తరలించారు. అనాధ ఆశ్రమానికి ఇచ్చిన లైసెన్స్ ను కూడా అధికారుల రద్దు చేశారు. అనాద ఆశ్రమంపై రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని  ఏర్పాటు చేసిందిఅనాధ ఆశ్రమంలో ఏం జరిగిందనే విషయమై హైపవర్ కమిటీ విచారణ నిర్వహించి నివేదికను అందించింది. ఈ బాలిక ఘటనతో అనాధాశ్రమంలో బాలికపై లైంగిక దాడి వెలుగు చూసింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అనాధశ్రమంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు సాగాయి.

alsor ead :అమీన్‌పూర్‌ మైనర్ బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక:మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూరే కారణం

అమీన్ పూర్ లోని  ప్రైవేట్ అనాథ శరణాలయంలో ఉంటున్న బాలిక అనారోగ్యంతో తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ సమయంలో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే లైంగిక దాడి జరిగిందని తేలింది. బాధితురాలి బంధువులు  బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిర్యాదు చేశారు. వేణుగోపాల్ రెడ్డిని, అనాథ శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్ లను పోలీసులు అరెస్టు చేశారు. 

అనాధ శరణాలయంలో ఐదో అంతస్థుకు దాత వేణు గోపాల్ రెడ్డి వచ్చినప్పుడు నిర్వాహకులు బాలికను ఆ గదిలోకి పంపేవారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ పానీయం తాగడంతోనే బాలిక స్పృహ కోల్పోయిందని ఎప్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎవరికీ చెప్పవద్దంటూ వార్డెన్ బెదిరించేదని బాలిక వాంగ్మూలం ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios