దేశంలోని అన్ని భాషల్లో హిందీ కూడా ఒకటి మాత్రమే.. బలవంతంగా రుద్దొద్దు.. కేటీఆర్ ట్వీట్..

అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు సెంట్రల్ వర్సిటీలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ కు బదులు హిందీని ప్ర‌వేశ‌పెట్టాల‌న్న నిర్ణయంపై కేటీఆర్ మండిపడ్డారు. 

india does not have a national language KTR tweet over hindi language in IITs

హైదరాబాద్ : ఐఐటీల్లో ఇంగ్లీషును హిందీతో రీప్లేస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. భారత్ కు జాతీయ భాష అంటూ ఏదీ లేదన్నారు. భారత్ లోని అనేక భాషల్లో హిందీ భాష కూడా ఒకటి అన్నారు. 

ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాలలో హిందీని తప్పనిసరి చేస్తూ నిబంధలను విధించడం ద్వారా ఎన్‌డిఎ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. భారతీయులకు తమ భాషను ఎంపిక చేసుకునే హక్కు ఉండాలి. హిందీని బలవంతంగా రుద్ధడాన్ని వ్యతిరేకిస్తున్నాం... అన్నారు. 

అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు సెంట్రల్ వర్సిటీలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ కు బదులు హిందీని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సుపై వచ్చిన కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.

కొత్త భాషా యుద్ధం మొద‌లు పెట్టొద్దు.. భార‌త ఐక్యతను కాపాడండి - కేంద్రానికి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి

ఇదిలా ఉండగా, హిందీని తప్పనిసరి భాషగా పేర్కొంటూ మరో “భాషాయుద్ధం” ప్రారంభించకూడదని అక్టోబర్ 11న కేంద్ర ప్రభుత్వాన్ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా కోరారు. ఆ దిశగా చేస్తున్నప్రయత్నాలను విరమించుకోవాలని.. భారతదేశ ఐక్యతను కాపాడాలని ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి, కేంద్ర ప్ర‌భుత్వానికి స్టాలిన్  విజ్ఞ‌ప్తి చేశారు. 

అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు సెంట్రల్ వర్సిటీలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని ప్ర‌వేశ‌పెట్టాల‌ని ప్యానెల్ చేసిన సిఫార్సుల‌లో ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంలు, కేంద్ర విద్యాలయాల వంటి సంస్థ‌లు  ఉన్నాయి. ఈ సిఫార్సుల‌ను అమ‌లు చేస్తే దేశ ఐక‌త్య నాశనమవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

రాజ్యాంగంలోని 8దో షెడ్యూల్ లో తమిళంతో సహా మరో 22 భాషలను సమాన హోదా ఇచ్చారని ఈ సందర్బంగా స్టాలిన్ గుర్తు చేశారు. భారతదేశంలో హిందీని ఉమ్మడి భాషగా సిఫారసు చేసే అవరసరం ప్యానెల్ కు ఎందుకు వ‌చ్చిందని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. ‘‘హిందీకి ప్రాధాన్యత ఇవ్వడానికి యూనియన్ రిక్రూట్‌మెంట్ పరీక్షలలో ఇంగ్లీష్ భాషా ప్రశ్నపత్రాలను నిలిపివేయాలని ఎందుకు సిఫార్సు చేశారు ’’ అని స్టాలిన్ ప్రశ్నించారు. 

దేశం మొత్తానికి ఒక భాషను ఉమ్మడిగా చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని తెలిపారు. ఇలా ఒక భాషను తప్పనిసరి చేయడం వల్ల భారతదేశంలో హిందీ మాట్లాడే వారు మాత్రమే సరైన పౌరులు, ఇతర భాషలు మాట్లాడే వారు సెకెండ్ క్లాస్ పౌరులు అని చెప్పడంతో సమానం అవుతుందని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios