Asianet News TeluguAsianet News Telugu

జీమెయిల్‌లో అనవసరమైన మెయిల్స్‌ ‌‌ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

. జీమెయిల్ లో అనవసర ఇమెయిల్‌ల కోసం స్పామ్ ఫోల్డర్‌ ఉంటుంది కానీ మనకు సంబంధం లేకుండానే మన జీమెయిల్ అకౌంట్‌లోకి స్పామ్ మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. ఒకోసారి ఇలాంటి మెయిల్స్‌ ఇబ్బంది కలిగిస్తుంటాయి. 

if your Gmail has a spam problem, here's solution how you can fix it
Author
Hyderabad, First Published Jul 7, 2020, 4:12 PM IST

ఈ రోజుల్లో జీమెయిల్ అంటే తెలియని వారు, వాడని వారు ఎవరు ఉండరు. జీమెయిల్ లో అనవసర ఇమెయిల్‌ల కోసం స్పామ్ ఫోల్డర్‌ ఉంటుంది కానీ మనకు సంబంధం లేకుండానే మన జీమెయిల్ అకౌంట్‌లోకి స్పామ్ మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. ఒకోసారి ఇలాంటి మెయిల్స్‌ ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఈ మధ్య స్పామ్  మెయిల్స్ సమస్య మరింత తీవ్రం కావడంతో జీమెయిల్ యూసర్లకు  సహాయపడే కొన్ని చిట్కాలు తెలిపింది. జీమెయిల్ లో  బగ్ వల్ల స్పామ్‌తో సహా అన్ని మెయిల్‌లు మన ఇన్‌బాక్స్‌లోకి  నేరుగా వచ్చి చేరుతుంటాయి. గూగుల్ ఈ బగ్‌  సమస్యను పరిష్కరించింది. జీమెయిల్ అనవసర మెయిల్స్‌ను స్పామ్ ఫోల్డర్‌లో ఉంచుతుంది, అవి 30 రోజుల తర్వాత వాటంతటే అవే డిలెట్ అవుతుంటాయి. 

 

రిపోర్ట్, బ్లాక్

మీరు కొన్ని అక్కౌంట్స్ నుండి క్రమం తప్పకుండా స్పామ్ మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. ఒకోసారి రోజుకి రెండు, మూడు సార్లు కూడా వస్తుంటాయి. ఇందుకోసం అలాంటి స్పామ్ మెయిల్స్‌ రిపోర్ట్ లేదా  బ్లాక్ చేయటం ద్వారా వాటిని రాకుండా చేయవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా మెయిల్ ఓపెన్ చేశాక పైన కనిపించే మూడు-చుక్కల బటన్ క్రింద మీరు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు “రిపోర్ట్ స్పామ్‌” అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు లేదా పంపినవారిని బ్లాక్ చేసిన సరిపోతుంది.

also read టిక్‌టాక్ క్రేజ్‌తో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్... ...

 

మెసేజ్‌లను ఫిల్టర్‌ చేయడం

మీరు మెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేయకూడదనుకుంటే లేదా పంపినవారిని బ్లాక్ చేయకపోతే మీరు అలాంటి మెసేజ్‌లను ఫిల్టర్ చేయవచ్చు. మీ ఇన్‌బాక్స్‌లో భవిష్యతులో మళ్ళీ  అలాంటి మెసేజ్‌లను కనిపించకుండా నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. మీరు ఉండే మూడు-చుక్కల మెనూకు వెళ్లి “ ఫిల్టర్ మెసేజ్‌ లైక్ దిస్” అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలు. కాగా ఫిల్టర్‌ కోసం కొన్ని పదాలు, సైజ్‌, అటాచ్‌మెంట్స్‌ వంటి మరిన్ని వివరాలను కూడా మెయిల్స్‌కు జోడించవచ్చు. ఈ ఫిల్టర్ చేసిన మెయిల్‌లను ఏమి చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు. దీన్ని ఆర్చివ్ చేయడం, డిలీట్‌ చేయడం, పొటెన్షియల్‌ స్పామ్‌గా లేబుల్ చేయడం ఇంకా  మరిన్ని ఆప్షన్  ఉన్నాయి. 

 

అన్‌ సబ్‌స్క్రయిబ్ మెయిల్స్

మరొక ఆప్షన్ ఏంటి అంటే మాన్యువల్గ ఇమెయిళ్ళకు అన్‌ సబ్‌స్క్రయిబ్ చేయటం. మనకు ఎక్కువ వచ్చే మెయిల్స్‌ లో ప్రోమోషనల్ మెయిల్స్‌ ఎక్కువగా వస్తుంటాయి. అవి వాస్తవానికి ప్రోమోషనల్ ఫోల్డర్‌లో ఉండాలి కాని ప్రాధమిక ఇన్‌బాక్స్‌లోకి వచ్చేస్తుంటాయి. అటువంటి ఇమెయిల్‌ల కోసం మీరు దాన్ని ఓపెన్ చేసి క్రిందకి స్క్రోల్ చేసి అన్‌ సబ్‌స్క్రయిబ్ పైన క్లిక్ చేసి ఒకే చేస్తే చాలు. మీరు ఇకపై ఆ పంపినవారి నుండి ఇమెయిల్‌లను చూడలేరు.

Follow Us:
Download App:
  • android
  • ios