టిక్‌టాక్‌ను ఇప్పుడు భారతదేశంలో నిషేధించడంతో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా 15 సెకన్ల చిన్న వీడియో ఫీచర్ ‘రీల్స్’ ను భారతదేశంలో పరీక్షిస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్ బ్యాన్ తో  ప్రత్యామ్నాయాలుగా ఉన్న చింగారి, రోపోసో ఇతర ప్లాట్‌ఫామ్‌లు టిక్‌టాక్ వినియోగదారులను ఆకర్షిస్తున్నయి.

ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు కొత్తగా రీల్స్ అప్ డేట్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. టిక్‌టాక్ లాగానే రీల్స్ కూడా వినియోగదారులకు 15-సెకన్ల ఆడియో క్లిప్‌లతో వీడియోలను చేసి, వాటిని స్టోరీస్ లోకి యాడ్‌ చేసుకోవచ్చు, వాటిని ఫీడ్‌లో పోస్ట్ చేయడానికి లేదా వాటిని డి‌ఎం చేయడానికి కూడా సహకరిస్తుంది.

చాలా ట్రాక్షన్ పొందిన, వైరల్ అయ్యే లేదా ట్రెండింగ్ వీడియో క్లిప్‌లు టాప్ రీల్స్ క్రింద ప్రత్యేక పేజీలో కనిపిస్తాయి. ఫేస్ బుక్ ప్రతినిధి మాట్లాడుతూ రీల్స్  అప్ డేట్ చేయడానికి కంపెనీ చూస్తున్నట్లు తెలిపింది. కానీ నిర్దిష్ట వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఇన్‌స్టాగ్రామ్ మొట్టమొదట గత ఏడాది బ్రెజిల్‌లో రీల్స్‌ను ప్రారంభించింది.

also read జియోమీట్‌ యాప్ గురించి మీకు తెలియని విషయాలు...

తరువాత ఫ్రాన్స్, జర్మనీ దేశలకు విస్తరించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫేస్‌బుక్ ఇటీవలే తన టిక్‌టాక్ లాంటి యాప్  ‘లాస్సో’ ను మూసివేసింది. ఇన్‌స్టాగ్రామ్ కోసం చాలా మంది టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్‌ను సృష్టించడానికి  ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటున్నా సందర్భంగా ఈ ఫీచర్ చాలా సరైన సమయంలో వస్తుంది.

అత్యంత ప్రాచుర్యం పొందిన షార్ట్ వీడియో యాప్‌ టిక్‌టాక్ తో సహా 59 చైనా యాప్‌లను భారత్ ఇటీవల నిషేధించింది. టిక్‌టాక్‌తో సహా మూడు చైనా యాప్స్ ను ఇండియా నిషేధించిన తరువాత బైట్‌డాన్స్ 6 బిలియన్ డాలర్లకు పైగా నష్టం కలిగినట్లు అంచనా వేస్తున్నట్లు సమాచారం.