Asianet News TeluguAsianet News Telugu

మన తెలంగాణ బంగారమే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌.. వరుసగా రెండో గోల్డ్ మెడల్ కొట్టిన నిఖత్ జరీన్

Nikhat Zareen: తెలంగాణ మట్టి బంగారం నిఖత్ జరీన్  మహిళల  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో మరోసారి మెరిసింది.   ఢిల్లీ వేదికగా ముగిసిన ఫైనల్స్ లో నిఖత్ వరుసగా రెండో గోల్డ్ మెడల్ కొట్టింది.  
 

Nikhat Zareen Clinched Second Successive Gold medal in Women's Boxing World Championships MSV
Author
First Published Mar 26, 2023, 7:32 PM IST

న్యూఢిల్లీ వేదకగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్  స్వర్ణం సాధించింది.   50 కిలోల విభాగంలో నిఖత్..  గోల్డ్ మెడల్ కొట్టింది.   గతంలో రెండు సార్లు ఆసియా ఛాంపియన్ అయిన వియాత్నాం క్రీడాకారిణి   గుయెన్ టాన్‌పై   5-0 తేడాతో నిఖత్  బంపర్ విక్టరీ కొట్టింది.  ఈ విజయంతో ఆమె  వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన  రెండో భారత బాక్సర్ గా చరిత్ర సృష్టించింది. 

గతేడాది ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో  విజేతగా నిలిచిన  నిఖత్.. తాజాగా ఈ విజయంతో  వరుసగా రెండోసారి  ఛాంపియన్ గా నిలిచింది. గతంలో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పేరిట ఈ రికార్డు ఉంది.  

 

ఇస్తాంబుల్ లో  52 కేజీల విభాగంలో  స్వర్ణం క సాధించిన  నిఖత్.. తాజా  పోటీలలో మాత్రం   50 కేజీల విభాగంలో పోటీ పడుతోంది.   ఫైనల్ లో  గుయెన్ టాన్ పై  ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన నిఖత్.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇ్వలేదు.  ఇదివరకే ఈ ఛాంపియన్‌ఫిప్  లో  48 కేజీల విభాగంలో నీతూ గంగాస్,  స్వీటీ లు స్వర్ణాలు నెగ్గిన విషయం తెలిసిందే. నిఖత్ కూడా   గోల్డ్ కొట్టడంతో  ఈ జాబితాలో భారత్ మూడు స్వర్ణాలు సాధించినట్టైంది.  

ఇదీ చదవండి : Nikhat Zareen: ఇందూరు టు ఇస్తాంబుల్.. మన మట్టి బంగారం నిఖత్ ప్రయాణం సాగిందిలా..

కాగా గత కొద్దికాలంగా నిఖత్ నిలకడగా రాణిస్తోంది.    జూనియర్ లెవల్ లో వరల్డ్  ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత   సీనియర్ లెవల్ లోకి ఎంట్రీ ఇచ్చిన  నిఖత్.. 2019,  2022లలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ లో   పసిడి పతకాలు గెలుచుకుంది.   ఇక గతేడాది ఇస్తాంబుల్ తో పాటు  కామన్వెల్త్ క్రీడల్లోనూ  స్వర్ణాలు సాధించింది.   ఈ ఏడాది  ఐబీఏ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లోనూ  నిఖత్ దే స్వర్ణం. తాజాగా  ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన నిఖత్.. వచ్చే ఏడాది  పారిస్ వేదికగా  జరిగే ఒలింపిక్స్ లో కూడా స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios