జగన్నాథ ఆలయానికి ఇటలీ మహిళా జట్టు.. భారతీయ సాంప్రదాయంలో పూజలు.. వీడియో వైరల్

పూరీ జగన్నాథ ఆలయాన్ని ఇటలీ మహిళా హాకీ టీమ్ సందర్శించింది. భారతీయ సాంప్రదాయంలో వారు పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

italy women hockey team visited odishas puri jagannath temple shows a viral video kms

ఇటలీ మహిళా హాకీ టీమ్ ఒలింపిక్ క్వాలిఫైర్ పోటీలను శుభ కార్యంతో మొదలు పెట్టుకుంది. జనవరి 12వ తేదీన ఈ మహిళల టీమ్ ఒడిశాలోని జగన్నాథ ఆలయం సందర్శించింది. రాంచీ కొండల్లో కొలువైన పూరీ జగన్నాథుడిని దర్శించుకుంది. స్థానిక సంప్రదాయాల్లోనే పూజలు నిర్వహించింది.

ఇటలియన్ టీమ్‌కు ప్రపంచంలో 19వ ర్యాంకింగ్ ఉన్నది. భారత టీం, న్యూజిలాండ్, యూఎస్ఏ టీమ్‌లతోపాటు ఇటలి విమెన్ టీమ్ పూల్ బీలో ఉన్నది. కానీ, ఇప్పటి వరకు ఈ టీమ్ ఒలింపిక్స్‌లో ఆడలేదు. కెప్టెన్ ఫెడెరికా కార్తాకు ఉన్న అనుభవం ఈ టీమ్‌కు కీలకంగా ఉపయోగపడనుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hockey India (@hockeyindia)

Also Read: Viral: సిక్స్ కొట్టిన బాల్‌ను ఎత్తుకెళ్లిన ప్రేక్షకుడు.. ఆగిపోయిన మ్యాచ్.. వీడియో వైరల్

ఫెడెరికా మాట్లాడుతూ.. ‘ఆలయ సందర్శనం అద్భుతమైన అనుభవం. మా టీమ్ మేనేజర్, భారత గైడ్ మాకు ఈ ఆలయ సందర్శన సలహా ఇచ్చారు. మా అందరికీ చాలా ఆసక్తిగా అనిపించింది. ఇక్కడి మతం, సంస్కృతిపై ఆసక్తి కలిగింది. నేను ఇది వరకు యూరప్ దాటి బయటకు రాలేదు. కాబట్టి, ఇది నాకు ఒక ప్రత్యేకమైన అనుభవమే అవుతుంది. ఆలయంలో భారతీయులు చేసే ప్రతి పని, పాటించే ప్రతి సాంప్రదాయాన్ని పాటించాం’ అని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios