Asianet News TeluguAsianet News Telugu

కస్టడీలో లాయర్‌తో బలవంతంగా సెక్స్ చేయించిన పోలీసులు

పంజాబ్‌లో కస్టడలో ఉన్న లాయర్‌తో తోటి నిందితుడిపై బలవంతంగా సెక్స్ చేయించిన ఫిర్యాదు కింద ముగ్గురు పోలీసులు అరెస్టు అయ్యారు. ఓ కేసులో లాయర్, సహ నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిద్దరిని దారుణంగా వేధించినట్టు లాయర్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. లాయర్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది.
 

lawyer forced into sex with co accused in custody by punjab police, arrested kms
Author
First Published Sep 28, 2023, 12:58 PM IST | Last Updated Sep 28, 2023, 12:58 PM IST

ఛండీగడ్: పంజాబ్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్తసర్ జిల్లాలో పోలీసులు ఓ కేసులో లాయర్‌ను, మరో వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిని టార్చర్ చేశారు. సహ నిందితుడిపై లాయర్‌ను బలవంతంగా సెక్స్ చేయించారు. జిల్లా మెజిస్ట్రేట్ సీరియస్ అయింది. లాయర్, ఆయన సహనిందితుడిని వేధించిన, అసహజ శృంగారానికి ఒత్తిడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎస్పీ, ఇద్దరు పోలీసులు అరెస్టు అయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పడింది.

లూధియానా పోలీసు కమిషనర మణిదీప్ సింగ్ సిద్దు సారథ్యంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పడగా.. దీన్ని ఇంటెలిజెన్స్ శాఖ అదనపు డీజీపీ పర్యవేక్షించనున్నారు.

బాధితుడైన లాయర్‌ సభ్యత్వమున్న పంజాబ్, హర్యానా హైకోర్టు బార్ అసోసియేషన్  ప్రతినిధులు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో సమావేశమై ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ భేటీ తర్వాతే పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. ఎస్పీ ర్యాంక్ అధికారి సహా ఆరుగురు పోలీసులుపై.. సహనిందితుడిపై బలవంతంగా లాయర్‌తో సెక్స్ చేయించిన అభియోగాలు నమోదయ్యాయి. ముక్తసర్ ఎస్పీ  (ఇన్వెస్టిగేషన్) రమణ్‌దీప్ సింగ్ భుల్లర్, ఇన్‌స్పెక్టర్ రామన్ కుమార్ కంబోజ్, కానిస్టేబుళ్లు హర్బన్స్ సింగ్, భుపిందర సింగ్, గురుప్రీత్ సింగ్, హోంగార్డ్ దారా సింగ్‌లపై కేసు నమోదైంది. ఇందులో ఎస్పీ భుల్లర్, ఇన్‌స్పెక్టర్ రామన్ కుమార్ కాంబోజ్, కానిస్టేబుల్ హర్బన్స్ సింగ్‌లు అరెస్టు అయ్యారు.

Also Read: ఇంట్లో సహాయం కోసం తీసుకెళ్లి.. బాలికపై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. ఆహారం పెట్టకుండా, నగ్నంగా ఉంచుతూ..

కస్టడీలో వేధింపులను సిట్ దర్యాప్తు చేసి పంజాబ్ డైరెక్టర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు సమర్పించనుంది.

లాయర్, మరో వ్యక్తిపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంచారజీ రామన్  కుమార్ కాంబోజ్ ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ పోలీసు బృందంపై దాడి చేశారని, వారి యూనిఫామ్‌లు చింపేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఈయన ఫిర్యాదుపై లాయర్, మరో వ్యక్తిని పోలీసులు సెప్టెంబర్ 14వ తేదీన అరెస్టు చేశారు.

అడ్వకేట్ స్టేట్‌మెంట్ సంచలనంగా మారింది. ఆయన స్టేట్‌మెంట్‌నే ఫిర్యాదుగా భావించి వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది. సెప్టెంబర్ 22న వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా పోలీసులపై కేసు ఫైల్ అయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios