కరసేవకుడు శ్రీకాంత్ పూజారికి బెయిల్.. 31 ఏళ్ల క్రితం కేసులో హుబ్బలి కోర్టు తీర్పు
కర్ణాటకలో అరెస్టయిన కరసేవకుడు శ్రీకాంత్ పూజారికి హుబ్బలి కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.
కర్ణాటకలో కరసేవకుల అరెస్టు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల నాటి కేసులో తాజాగా అరెస్టు చేపట్టడంపై బీజేపీ ఆగ్రహించింది. ఇటీవలే ఈ కేసులో శ్రీకాంత్ పూజారి అరెస్టు అయ్యారు. ఈ కేసుపై వాదనలు విన్న హుబ్బలి కోర్టు తాజాగా శ్రీకాంత్ పూజారికి ఊరట ఇచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 9వ తేదీన పోలీసులు శ్రీకాంత్ పూాజరిని అరెస్టు చేశారు. 1992 డిసెంబర్ 5వ తేదీన జరిగిన రామజన్మ భూమి వివాదానికి సంబంధించిన అల్లర్ల కేసులో ఆయనకు ప్రమేయం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులోనే ఆయనను అరెస్టు చేశారు. దీంతో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. శ్రీకాంత్ పూజారిని వెంటనే విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు.
Also Read: Sonia Gandhi: ఖమ్మం నుంచి లోక్ సభ బరిలో సోనియా గాంధీ.. సౌత్ మిషన్‌లో భాగమేనా?
తాజాగా, హుబ్బలి ఫస్ట్ అడిషనల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ దరఖాస్తుపై ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ తీర్పు వెలువరించింది.
ఈ కేసు గురించి..
హజారెసాబ్ మాలిక్ సాబ్ ఫిర్యాదు ఆధారంగా శ్రీకాంత్ పూజారిపై కేసు నమోదైంది. ఐపీసీలోని 143,147,436,427,149 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. మూడో నిందితుడిగా శ్రీకాంత్ పూజారి ఉన్నాడు. ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఓ అనూహ్యమైన ట్విస్ట్ ఉన్నది. పిటిషన్ ప్రకారం ఈ కేసు విభాగాలుగా ఉన్నది. ఇతరులకు సంబంధం లేకుండా శ్రీకాంత్ పూాజారిపైనా ప్రత్యేకంగా కేసు ఉన్నది. ఊహించని మలుపులో ఒరిజినల్ కేసు ట్రయల్ కోర్టులో పరిష్కృతం అయింది. శ్రీకాంత్ పూజారి కాకుండా మిగిలిన నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్, ఎఫ్ఐఆర్ నాశనం చేశారని పిటిషనర్ వాదించాడు.
Also Read : Viral: న్యూజిలాండ్ యంగ్ లీడర్ పవర్‌ఫుల్ స్పీచ్ వైరల్.. స్థానిక తెగ భాష తో దద్దరిల్లిన పార్లమెంటు
హుబ్బలి పోలీసులు శ్రీకాంత్ పూజారిని అరెస్టు చేయగా పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. డిసెంబర్ 29వ తేదీన శ్రీకాంత్ పూజారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆశ్చర్యకరంగా ఎఫ్ఐఆర్ కాపీ, ఇతర ఫిర్యాదులేవీ అందుబాటులో లేవు. శ్రీకాంత్ ఈ అంశాల నే పేర్కొంటూ బెయిల్ కావాలని అడిగాడు. కేసులోని సంక్లిష్టాలు, డాక్యుమెంట్ల మిస్సింగ్ వంటివి కేసును కఠినతరం చేశాయి.