Assembly Elections : తెలంగాణ మహిళలు రాజకీయాలు చేయలేరా?

ఆదివారం ఫలితాలు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల్లో, సోమవారం ఫలితాలు వెలువడ్డ మిజోరాంలో ఒక్క  ఛత్తీస్‌గఢ్ లో మాత్రమే 20శాతం మహిళలు ఎన్నికయ్యారు. 

How Many Women Elected as MLAs on 5 states Assembly Elections - bsb

న్యూఢిల్లీ : ఆకాశంలో సగం..అవకాశాల్లో సగం కానీ శాసనసభల్లో ప్రాతినిథ్యానికి వచ్చేసరికి 33 శాతం కూడా లేరు మహిళలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మహిళలు నామమాత్రమే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా.. ఇంకా అమలులోకి రానందుకే ఈ పరిస్థితా? ఏఏ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు?

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది. సోమవారం వెలువడిన మిజోరాం ఫలితాల్లో ప్రతిపక్ష జెడ్ పీఎంకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

Fishing Boat Missing: 40 మంది మత్స్యకారులతో బోటు గ‌ల్లంతు.. అరేబియా సముద్రంలో గాలింపు చర్యలు

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కస్థానంతో సరిపెట్టుకుంటే, బీజేపి రెండు స్థానాలతో కాస్త గుడ్డిలో మెల్లగా ఉంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ రాష్ట్రాల్లో మహిళలు ఎంతమంది ఎన్నికయ్యారనేది చర్చ జరుగుతోంది. దీనికి కారణం కూడా ఉంది. ఎన్నికలకు కేవలం రెండు నెలల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 

కానీ, 2029 వరకు అమలు చేయబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళా ప్రాతినిధ్య పరంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం ఎంత శాతం ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిమీద పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (పీఆర్ఎస్) ఒక విశ్లేషణ చేసింది. దీని ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో ఒక్క ఛత్తీస్‌గఢ్ లో మాత్రమే  20శాతం కంటే ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో 19 మంది మహిళలు ఉన్నారు. 

ఇప్పటివరకు ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో ఇప్పటివరకు ఇంత అత్యధిక స్థాయిలో మహిళలు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పోలిస్తే.. అందులో సూచించినట్టుగా 33 శాతం కంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి. 

ఛత్తీస్ గఢ్ తో పోలిస్తే.. ఇతర రాష్ట్రాలు మరీ దారుణంగా ఉన్నాయి. తెలంగాణలో అయితే.. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో కేవలం 10 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. కాస్త సంతోషకరమైన విషయం ఏంటంటే.. 2018లో ఆరుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా పోల్చుకుంటే కాస్త మెరుగైనట్టే. అంటే ఈ సారి మహిళా ప్రాతినిథ్యం అసెంబ్లీలో 8%  ఉందన్నమాట. 

మధ్యప్రదేశ్‌లో, మొత్తం 230 అసెంబ్లీ సీట్లలో 27 స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. మధ్యప్రదేశ్ లో మహిళా ఎమ్మెల్యేల పర్సంటేజ్ 11.7%. మధ్యప్రదేశ్ లో 2013లో అత్యధికంగా 30 మంది మహిళలు శాసనభకు ఎన్నికయ్యారు.

రాజస్థాన్‌లో గతంతో పోలిస్తే ఈసారి మహిళా ఎమ్మెల్యేల వాటా తగ్గింది.. 2018లో 24 మంది మహిళల శాసనసభకు ఎన్నికవ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 20కి పడిపోయింది. అంటే 10%కి తగ్గిందన్నమాట. 

చివరగా మిజోరాంలో మొత్తం 16మంది మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే.. ముగ్గురు మాత్రమే గెలిచారు. ఇందులో ఒకరు ఎంఎన్ఎఫ్ ప్రతిపక్ష ప్రోవా చక్మా,  కాగా ఇద్దరు అధికార పార్టీకి లాల్రిన్ పూయి, జెపీఎం, బేరిల్ వంగేసాంగీ జేపీఎంలు ఉన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios