బాలికపై రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు.. అసెంబ్లీ నుంచి బహిష్కరణ
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఓ ఎమ్మెల్యేపై ఉత్తప్రదేశ్ అసెంబ్లీ బహిష్కరించింది. అతడు బీజేపీ నుంచి 2022లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో అతడిపై అత్యాచారం కేసు నమోదయ్యింది. తాజాగా కోర్టు ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది.
తొమ్మిదేళ్ల క్రితం బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో అతడిని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగా అనర్హులుగా ప్రకటించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధిని నేరం రుజువైన తేదీ నుంచి అనర్హులుగా ప్రకటిస్తారు. దీంతో పాటు శిక్ష అనుభవించిన తర్వాత మరో ఆరేళ్ల పాటు అనర్హులుగా ఉంటారు.
హిజాబ్ నిషేధం ఎత్తివేతపై వెనక్కి తగ్గిన కర్ణాటక సీఎం.. ఆ అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని వ్యాఖ్య..
2014లో సోన్ భద్రలో మైనర్ బాలికపై రాందులర్ గోండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికి అతడు ఎమ్మెల్యే కాదు. కానీ అతడి భార్య గ్రామ ప్రధాన్ అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యప్రకాశ్ త్రిపాఠి ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. అత్యాచార బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు గోండ్ పై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష) తో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది.ఈ క్రమంలోనే 2022లో అతడు ఎస్టీ రిజర్వ్ డ్ స్థానం అయిన దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దీంతో ఈ కేసును ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ కేసులో అప్పటి నుంచి విచారణ సాగుతోంది.
ధైర్యం ఉంటే ప్రధాని మోడీపై పోటీ చేయాలి.. మమతా బెనర్జీకి బీజేపీ సవాల్..
అయితే కేసును విచారించిన సోన్ భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా కోర్టు డిసెంబర్ 12 న గోండు ను దోషిగా నిర్ధారించింది. మూడు రోజుల అనంతరం సెషన్స్ జడ్జి అహ్సాన్ ఉల్లా ఖాన్.. దోషి అయిన గోండ్ కు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. అయితే ఈ డబ్బును ఇప్పుడు అత్యాచార బాధితురాలుకు ఇవ్వనున్నారని లాయర్ సత్యప్రకాశ్ త్రిపాఠి తెలిపారు. ఆమెకు ప్రస్తుతం వివాహమైంది. ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది.
కాగా.. ఇలాగే వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన ఉత్తరప్రదేశ్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడింది. 2022 అక్టోబర్ లో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే (రాంపూర్ సదర్ ఎమ్మెల్యే) ఆజంఖాన్, బీజేపీకి చెందిన విక్రమ్ సింగ్ సైనీ (ఖతౌలి ఎమ్మెల్యే)పై అనర్హత వేటు పడింది. ఇందులో 2019 విద్వేష ప్రసంగాల కేసులో ఖాన్ కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా, 2013 ముజఫర్నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన సైనీపై అనర్హత వేటు పడింది. ఉన్నావ్ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2020 ఫిబ్రవరిలో అసెంబ్లీ నుంచి అనర్హత వేటు వేశారు. గతంలో ఆయనను బీజేపీ బహిష్కరించింది.