లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024లో బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందారు. గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్ షా 7 లక్షల 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లో కూటమి, కేంద్రంలో ఎన్డీయే

ఏసియానెట్ తెలుగు ఎన్నికల లైవ్ బ్లాగ్‌కి స్వాగతం. దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చేశాయి. అయితే మంగళవారం ఈ ఫలితాల తీరు ఎలా ఉండిందో.. మీరిక్కడ చూడవచ్చు.
దేశంలోనే అమిత్ షా కు రికార్డు మెజార్టీ..
"ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో నీకు తెలుసు..": పవర్ స్ఠార్ కు మెగాస్టార్ విషెస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి తన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇలా ట్విట్ చేశారు. ’’డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.’’ అంటూ పోస్ట్ చేశారు.
చంద్రబాబుకు చిరంజీవి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కూటమి విజయం సందర్భంగా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ’’ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !’’ అంటూ చిరు ట్వీట్ వేశారు.
మంగళగిరిలో నారా లోకేష్ భారీ ఆధిక్యం..
15 రౌండ్లు ముగిసేసరికి నారా లోకేష్ 70 వేలకుపైగా ఓట్ల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న జనసేనాని
ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించార. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలు చేరబోతున్నారు.
వరంగల్‌లో కడియం కావ్య విజయదుందుభి
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పలు చోట్ల నువ్వా.. నేనా అన్నట్టు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుపొందగా.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వరంగల్‌లో కడియం కావ్య రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
రెండు చోట్ల రాహుల్ గాంధీ భారీ విజయం..
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
గుడివాడలో కొడాలి నాని ఘోర పరాజయం
గుడివాడలో టీడీపీ నుంచి పోటీ చేసిన వెనిగండ్ల రాము 51 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నల్గొండలో జానారెడ్డి కుమారుడు భారీ విజయం.. వైఎస్ జగన్ రికార్డు బ్రేక్
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి రికార్డు విక్టరీ సాధించారు.బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.51 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. 2011లో కడప లోక్‌సభ ఉపఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో గెలిచిన జగన్ రికార్డు ను బ్రేక్ చేశారు.
గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్.. కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా..
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో గవర్నర్ ను కలిసి జగన్ తన రాజీనామా లేఖను అందించనున్నారు .
అసదుద్దీన్ ఓవైసి విజయం
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై విజయం..
తెలంగాణ కాంగ్రెస్ విజయ బావుటా.. గెలుపొందిన స్థానాలివే..
ఖమ్మంలో నామా నాగేశ్వరరావుపై రఘురాంరెడ్డి (కాంగ్రెస్) విజయం
వరంగల్‌లో అరూరి రమేశ్‌పై కడియం కావ్య (కాంగ్రెస్) విజయం
నల్గొండలో సైదిరెడ్డిపై కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్) విజయం
మహబూబాబాద్‌లో మాలోతు కవితపై బలరాం నాయక్ (కాంగ్రెస్) విజయం
జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌పై సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) విజయం
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయం
డోన్ లో బుగ్గన రాజేంద్ర నాథ్ ఓటమి
డోన్ లో బుగ్గన రాజేంద్ర నాథ్ ఓటమి
బుగ్గన పై కోట్ల సూర్యప్రకాశ్ గెలుపు
6450 ఓట్ల అధిక్యం
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం దిశగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఆయన 50వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. దీంతో ఆయన విజయం ఖాయమయిపోయింది.
ఇప్పటివరకు గెలిచిన టిడిపి అభ్యర్థులు వీరే....
ఉరవకొండలో పయ్యావుల కేశవ్, రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు, చింతలపూడిలో సొంగ రోషన్, ఉండిలో రఘురామ కృష్ణంరాజు, విశాఖ వెస్ట్ గణబాబు విజయం సాధించారు.
తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ హోరాహోరీ ... ఎక్కడ ఎవరి ఆధిక్యం వుందంటే...
తెలంగాణలో లోక్ సభలు, పార్టీలు, అభ్యర్థుల వారిగా ఎవరు, ఎంత ఆధిక్యంలో వున్నారంటే...
బిజెపి అభ్యర్థులు :
నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ కు 1,00,760 ఓట్ల ఆధిక్యం
మహబూబ్ నగర్ లో డికె అరుణకు 14,915 ఓట్ల ఆధిక్యం
ఆదిలాబాద్ లో గోడం నగేష్ 63,350 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్ లో బండి సంజయ్ 1,53,316 ఓట్ల ఆధిక్యం
మెదక్ లో రఘునందర్ రావు 31,817 ఓట్ల ఆధిక్యం
మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ 2,44,165 ఓట్ల ఆధిక్యం
చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 1,15,184 ఓట్ల ఆధిక్యం
సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి 49,254 ఓట్ల ఆధిక్యం
కాంగ్రెస్ అభ్యర్థులు :
ఖమ్మంలో రఘురామ్ రెడ్డికి 4,11,219 ఓట్ల ఆధిక్యం
మహబూబాబాద్ లో బలరాం నాయక్ కు 2,98,178 ఓట్ల ఆధిక్యం
భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1,53,067 ఓట్ల ఆధిక్యం
నాగర్ కర్నూల్ లో మల్లు రవికి 69,629 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లిలో గడ్డం వంశీకి 96,655 ఆధిక్యం
జహిరాబాద్ లో సురేశ్ షెట్కార్ కు 31,629 ఓట్లు
వరంగల్ లో కడియం కావ్య 1,58,977 ఓట్ల ఆధిక్యం
హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసికి 2,12,334 ఓట్ల ఆధిక్యం
చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్...
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి విజయం ఖాయం కావడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమిత్ షా కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందించారు. టిడిపి కూటమి ఘనవిజయం ఖాయమైన నేపథ్యంలో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
ఎన్డిఏ కూటమి 300 చోట్ల ఆధిక్యం..
ఎన్డిఏ కూటమి 300 సీట్లలో ఎన్డిఏ ఆధిక్యంలో వున్నట్లు ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. ఇండి కూటమి 225 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్..
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. ఆయన రాజ్ భవన్ కు చేరుకుని రాజీనామాను సమర్పించనున్నారు.
కొవ్వూరులో టిడిపి, అనపర్తిలో బిజెపి విజయం....
కొవ్వూరులో టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, అనపర్తిలో బిజెపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.