ఓ వైపు కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచం మల్లగుల్లాలు పడుతుంటే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్‌ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు ఆపడం లేదు.

Also Read:జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది రియాజ్ నాయక్ అరెస్ట్

ఉగ్రవాదులను భారత్‌లో చొరబడేందుకు వీలు కలిగించేలా... పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద కాల్పులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పాక్ సైన్యానికి భారత జవాన్లు తమ సత్తా ఏంటో చూపించారు.

పూంచ్ సెక్టార్‌లోని ఎల్‌వోసీ వద్ద పాక్ సైనికులు కాల్పులకు దిగారు. దీనికి ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం.. పాక్ ఔట్‌పోస్టులపై గుండ్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు పాక్ జవాన్లు మరణించగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా సమాచారం.

Also Read:గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్ ప్రోగ్రామే' కారణం: కాంగ్రెస్ ఆరోపణ

అలాగే భారత సైన్యం జరిపిన దాడిలో నాలుగు పాకిస్తాన్ పోస్టులు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అంతకుముందు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పూంచ్ సెక్టార్‌లో పలు భవనాలు ధ్వంసం కావడంతో పాటు ఓ పౌరుడు గాయపడినట్లు భారత సైన్యం తెలిపింది.