Asianet News TeluguAsianet News Telugu

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగుపాటు.. గ్రౌండ్ లోనే క్రీడాకారుడు మృతి.. వీడియో వైరల్

ఫుట్ బాల్ ఆడుతున్న సమయంలో క్రీడాకారుడిపై నేరుగా పిడుగు పడింది (Football player dies of lightning). దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఇండోనేషియాలో (A football player died after being struck by lightning in Indonesia.) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral on social media)గా మారింది.

A football player died after being struck by lightning in Indonesia. Video goes viral..ISR
Author
First Published Feb 12, 2024, 11:56 AM IST | Last Updated Feb 12, 2024, 11:56 AM IST

ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ ఆడుతుండగా ఒక్క సారిగా పిడుగుపడింది. అది నేరుగా ఫుట్ బాల్ క్రీడాకారుడిపై పడటంతో గ్రౌండ్ లోనే అక్కడికక్కడే మరణించాడు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఫుట్ బాల్ క్రీడాకారుడు మైదానంలో మామూలుగా నడుస్తున్నాడు. బాల్ తన వద్దకు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. అయితే సడెన్ గా పై నుంచి నేరుగా అతడిపై పిడుగుపడింది. దీంతో అతడు ఒక్క సారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. 

అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. లోపల ఎలా ఉందో చూడండి..

దీంతో మైదానంలోని ఇతర ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ అప్పటికే అతడి ప్రాణాలు పోయాయి. కానీ సహచరులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ పిడుగుపాటుతో ఆయన మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఆడిన క్రీడాకారుడు హఠాన్మరణానికి గురికావడంతో సహచరులు తీవ్రంగా విలపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios